సందడిగా సైమా అవార్డ్స్ వేడుక షురూ..!!

  • October 5, 2019 / 04:04 PM IST

సింగపూర్ లోని సెంటెక్ కన్వేషన్ సెంటర్ లో గురువారం వైభవంగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)2016 వేడుక ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరగనున్నఈ కార్యక్రమానికి దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తొలి రోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులను అందించారు. ఈ వేదికపై ప్రముఖ గాయని జానకికి జీవిత సాఫల్య పురస్కారం అందించి సత్కరించారు.

ఈ అవార్డు ప్రదానోత్సవానికి నిర్మాత, నటి మంచు లక్ష్మీ, హాస్య నటుడు ఆలీ హోస్ట్ గా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. దేవి శ్రీ ప్రసాద్, ప్రణీత, ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఉత్సాహంగా డ్యాన్సులు చేసి అదరగొట్టారు. నేడు (శుక్రవారం) తమిళం, మలయాళం సినిమాలకు అవార్డులను ప్రకటించనున్నారు.

సైమా అవార్డ్స్(తెలుగు) గ్రహీతలు వీరే..

ఉత్తమ చిత్రం : బాహుబలి


ఉత్తమ నటుడు : మహేష్ బాబు (శ్రీమంతుడు)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : అల్లు అర్జున్ (రుద్రమ దేవి)


ఉత్తమ నటి : శృతి హాసన్ (శ్రీమంతుడు)


ఉత్తమ నటి (క్రిటిక్స్) : అనుష్క (రుద్రమ దేవి)


ఉత్తమ ప్రతి కథానాయకుడు : రానా


ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ (శ్రీమంతుడు)


ఉత్తమ సహాయ నటి : రమ్య కృష్ణ (బాహుబలి)


ఉత్తమ హాస్య నటుడు : వెన్నెల కిషోర్ (భలే భలే మగాడివోయ్)


ఉత్తమ దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి (బాహుబలి)


ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)


ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : కె.కె.సెంథిల్ కుమార్ (బాహుబలి)


ఉత్తమ ఫైట్ మాస్టర్ : పీటర్ హెయిన్స్ (బాహుబలి)


ఉత్తమ రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (కంచె)


ఉత్తమ గాయకుడు : సాగర్ (జతకలిసే)


ఉత్తమ గాయని : సత్య యామిని (మమతల తల్లి /బాహుబలి)


ఉత్తమ తొలి చిత్ర నటుడు : అఖిల్ అక్కినేని (అఖిల్)


ఉత్తమ తొలి చిత్ర నటి : ప్రగ్యా జైస్వాల్ (కంచె)


ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : అనిల్ రావి పూడి (పటాస్)


యూత్ ఐకాన్ : సమంత

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus