Simbu: కష్టాల్లో ఉన్న అతనికి సహాయం చేసిన శింబు.. గ్రేట్ అంటూ?

  • June 28, 2024 / 02:27 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Silambarasan) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నటుడు పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా తాజాగా శింబు చేసిన మంచి పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి పేరును సొంతం చేసుకున్న వెంగల్‌ రావు గత కొంతకాలంగా అనారోగ్యంగా మంచానికే పరిమితం కావడం గమనార్హం. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ వెంగల్ రావు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది.

వెంగల్ రావుకు శింబు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో వడివేలు వెంగల్ రావు కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబోలో వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి. గత కొంతకాలంగా వెంగల్ రావుకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. పక్షవాతం రావడంతో ఒక కాలు, చెయ్యి పని చేయక వెంగల్ రావు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మెరుగైన వైద్యం కోసం ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆయన వీడియో రిలీజ్ చేసి ఆర్థిక సహాయం కోరారు. మరి కొందరు సినీ సెలబ్రిటీలు సైతం వెంగల్ రావుకు సహాయం చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శింబు రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉండగా శింబు సినిమాలు తెలుగులో కూడా విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విభిన్నమైన కథలను ఎంచుకుంటే శింబు ఖాతాలో మరిన్ని హిట్లు చేరే అవకాశాలు అయితే ఉంటాయి. కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి చెందిన వాళ్లను ఇండస్ట్రీ హీరోలే ఆదుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శింబు రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags