ఓటీటీకి వచ్చేసిన శింబు కొత్త సినిమా.. ఒకటి కాదు రెండు!

ఒకేసారి ఒకే సినిమా రెండు ఓటీటీల్లో చాలా తక్కువ అని చెప్పాలి. ఒకవేళ వచ్చినా రెండు రిలీజ్‌ల మధ్య గ్యాప్‌ ఉంటుంది. అయితే శింబు కొత్త సినిమా ఇప్పుడు ఒకేసారి ఓటీటీల్లోకి వచ్చేస్తోంది. ఎన్‌.కృష్ణ దర్శకత్వంలో శింబు నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పత్తు తలా’నే ఆ సినిమా. గౌతమ్‌ కార్తీక్‌, ప్రియా భవానీశంకర్‌, గౌతమ్‌ మేనన్‌ ఇతర కీలక పాత్రల్లో ఆ సినిమా ఓటీటీ రిలీజ్‌ను ప్రకటించారు. ఈ నెల 27న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఉండబోతోంది. మార్చి 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

‘మానాడు’ సినిమాతో ఓ విధంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శింబు.. ‘పత్తు తలా’ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాడు అని చెప్పాలి. బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌, సింప్లీ సౌత్‌ ఓటీటీల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ‘మఫ్టీ’ సినిమాకు రీమేక్‌గా ‘పత్తుతలా’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇసుక మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శింబు ఏజీఆర్‌గా కనిపించాడు.

థియేటర్లలో రూ.50కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఏ రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి. అన్నట్లు ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్‌ చేయలేదు. దీంతో ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి అంతా సిద్ధమవుతున్నారు. అయితే ఓటీటీలోనూ తమిళ వెర్షన్‌ మాత్రమే ఉంటుంది అంటున్నారు. రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మొత్తంగా రూ. 15 కోట్లు ఎక్కువ వసూలు చేసింది.

అన్నట్లు ఈ సినిమా ప్రదర్శితమైన చెన్నైలోని ప్రముఖ థియేటర్ రోహిణి దగ్గర పెద్ద పంచాయితీనే జరిగిన విషయం తెలిసిందే. సినిమా చూడటానికి వచ్చిన ఓ గిరిజన కుటుంబాన్ని లోపలికి వెళ్లేందుకు యాజమాన్యం అనుమతించలేదు. టికెట్‌ ఉన్నా ఎంట్రీకి నిరాకరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. యాజమాన్యం తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus