Simhadri Re-Release: ఆ తేదీన సింహాద్రి మూవీ రీరిలీజ్ కానుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి మూవీ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు మాస్ ప్రేక్షకుల్లో రాజమౌళి క్రేజ్ ను మరింత పెంచింది. ఈ సినిమా వల్లే రాజమౌళి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగడంతో పాటు తారక్ కు మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. తారక్ ఎన్ని సినిమాలలో నటించినా సింహాద్రి సినిమా ఫ్యాన్స్ కు ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాను 4కే వెర్షన్ లో అప్ డేట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే రీరిలీజ్ లో సింహాద్రి మూవీ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సింహాద్రి సినిమాలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించగా ఈ హీరోయిన్లకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రీరిలీజ్ కోసం తారక్ అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

జాన్వీ కపూర్ ఈ సినిమాలో తారక్ కు జోడీగా ఫిక్స్ అయ్యారు. మేకర్స్ త్వరలో అధికారికంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ వివరాలతో పాటు ఇతర విషయాలను కూడా వెల్లడించనున్నారు. 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus