2003 లో “ఐతే” సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన ముంబై బ్యూటీ సింధు తులాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సింధు తులాని నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఇతర చిత్రాలలో నటించే అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన అతనొక్కడే సినిమా ద్వారా సింధుకి మంచి పేరు వచ్చింది.
ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది సింధు. తెలుగులో దాదాపు 30 కి పైగా సినిమాలలో నటించింది సింధు తులాని. ప్రస్తుతం సింధుతులని క్యారెక్టర్ ఆర్టిస్టు లాంటి పాత్రలలో నటిస్తోంది. మొదట్లో హీరోయిన్ గా నటించిన తర్వాత ఇటీవల వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోకి వదినగా, ప్రేమ కావలి సినిమాలో, చివరిగా చిత్రాంగద అనే మూవీలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక థియేటర్ కోర్సు పూర్తి చేసింది (Sindhu Tolani) సింధు తులాని. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తిని పెంచుకుంది. తన కెరీర్ బిగినింగ్ లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కు మోడల్ గా వ్యవహరించింది. బాలీవుడ్ లో మొహబ్బతే చిత్రంలో హీరోయిన్ గా షమిత శెట్టి ఫ్రెండ్ గా కూడా నటించింది.
సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. ఇక ఈమె భర్త ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు శ్వేతా అనే కుమార్తె ఉంది. అయితే పెళ్లయిన ఏడాదికే మళ్ళీ చిత్ర పరిశ్రమ లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలలో నటిస్తోంది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్