‘గజిని’ చిత్రంతో తెలుగులో కూడా మార్కెట్ ఏర్పరుచుకున్న సూర్య అటు తర్వాత ‘యముడు’ ‘సెవెంత్ సెన్స్’ వంటి చిత్రాలతో మరింత క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఇక హరి దర్శకత్వంలో ‘యముడు’ వంటి హిట్ మూవీకి కొనసాగింపుగా ‘సింగం'(యముడు2) మూవీ కూడా వచ్చింది.పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూర్య ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. 2013 వ సంవత్సరం జూలై 5న ఈ చిత్రం విడుదలై మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నేటితో ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.45 cr |
సీడెడ్ | 1.98 cr |
ఉత్తరాంధ్ర | 1.34 cr |
ఈస్ట్ | 0.69 cr |
వెస్ట్ | 0.51 cr |
గుంటూరు | 0.92 cr |
కృష్ణా | 0.72 cr |
నెల్లూరు | 0.49 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 10.01 cr |
‘సింగం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.1 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.2.3 కోట్ల లాభాలు దక్కినట్టు తెలుస్తుంది.’యముడు’ తో పోలిస్తే ఈ చిత్రానికి తక్కువ కలెక్షన్లు వచ్చినప్పటికీ.. ఈ చిత్రం కూడా తెలుగులో పోటీ సినిమాల నడుమ సక్సెస్ సాధించడం విశేషం.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!