Chinmayi, Ranveer: ఇది అటెన్షన్ కోసమే.. సీఎం, ఎం.పి ల కేసులు వెయ్యండి: చిన్మయి

ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌‌ నగ్నంగా ఫోటోషూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇది కాస్త సంచలనమైంది. ఈ ఫోటో షూట్ కోసం రూ.55 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.ఈ ఫోటోల పై నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అనూహ్యంగా కొంతమంది రణ్‌వీర్‌ గట్స్ ను మెచ్చుకుంటూ ట్వీట్లు కూడా వేశారు. ఇలాంటి వాటిపై పాజిటివ్ గాను కాకుండా నెగిటివ్ గాను కాకుండా.. ద్వంద్వార్థం ప్రతిబింబించేలా కామెంట్లు చేయడం రాంగోపాల్ కు అలవాటు అన్న సంగతి తెలిసిందే.

ఆయన కూడా రణ్‌వీర్‌ సింగ్‌‌ నగ్నంగా చేసిన ఫోటో షూట్ పై స్పందించాడు. రణ్‌వీర్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నట్టు కామెంట్లు చేయడం మొదలుపెట్టిన వర్మ.. అటు తర్వాత ఆడవాళ్లు కూడా ఇలా చేస్తే ఇంతే మద్దతు ఇవ్వాలి, అప్పుడే సమానత్వం అన్నది ఉన్నట్టు అంటూ వర్మ పేర్కొన్నాడు. ఇక తాజాగా చిన్మయి రణ్‌వీర్‌ నగ్నంగా చేసిన ఫోటో షూట్ పై స్పందించింది. ‘మీకు బుద్దుందా? పనీ పాట లేదా? ఇలాంటి వేస్ట్ కేసులు వేసి కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారేంటి. రేప్ లు చేస్తూ దర్జాగా తిరుగుతున్న రాజకీయ నాయకులను ముందు టార్గెట్ చేయండి.

ఆడవాళ్ల మధ్యలో డ్యాన్సులు వేసే సీఎంలు, మహిళలను వేధించే ఎంపీ లు చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ళ పై కేసులు వేయండి. ఇదంతా జనాల అటెన్షన్ కోసమే’ అంటూ ఆమె పేర్కొంది. నిజానికి చిన్మయి ఇలాంటి వాటిని అస్సలు సమర్ధించదు. ఇప్పుడు ఈ ఫోటోల గురించి ఆమె ఓ నెగిటివ్ కామెంట్ వేస్తే.. ఇంకా ఇంకా ఈ ఫోటోల పై ఏదో ఒక కామెంట్ చేయాల్సి వస్తుందని ఆమె భావించినట్టు ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus