Chinmayi: చిన్మయి మంచి మనస్సు.. ఆ ఫ్యామిలీలకు సాయం..?

స్టార్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయికి తెలుగు, తమిళ భాషల్లో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పి ఫేమస్ అయిన చిన్మయి గొంతుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. చిన్మయి పాడిన పాటలలో ఎన్నో పాటలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల ద్వారా చిన్మయి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే సోషల్ మీడియా వేదికగా చిన్మయి ప్రశ్నిస్తున్నారు. తాజాగా చిన్మయి తాను సహాయం చేయాల్సిన కుటుంబాలు కొన్ని ఉన్నాయని పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు తాను ఆర్థిక తోడ్పాటును అందించాలని ఆమె వెల్లడించారు. ముగ్గురు విద్యార్థులకు తాను ఫీజు చెల్లించాలని ఆ ముగ్గురు విద్యార్థులలో ఒకరు మెడికల్ విద్యార్థి అని చిన్మయి పేర్కొన్నారు. ఎవరైతే తనకు సహాయం చేస్తారో వారికి నచ్చిన పాటను వీడియోగా పంపుతానని లేదా వాళ్లకు ఇష్టమైన వ్యక్తులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియో పంపిస్తానని చిన్మయి వెల్లడించారు.

అందుకు బదులుగా డబ్బులు ఇవ్వాలని ఆమె కోరారు. చిన్మయి సాయం చేయాల్సిన ఫ్యామిలీల కొరకు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ చిన్మయి గొప్పమనస్సును చాటుకుంటున్నారు. చిన్మయి గతంలో కూడా ఛారిటీల కోసం పాటలు పాడిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు కోట్ల రూపాయల సంపాదన ఉన్నా సాయం చేయడానికి వెనుకడుగు వేస్తుంటే చిన్మయి మాత్రం నెటిజన్ల సహకారంతో మంచి పనులు చేస్తుండటం గమనార్హం.


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus