దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే మాట సినిమా వాళ్ల విషయంలో చక్కగా సరిపోతుంది. నటీనటుల దగ్గరి నుండి సాంకేతిక నిపుణుల వరకు ఓ హిట్ పడినా, లేదంటే ఫామ్‌లో ఉండగా పారితోషికాలు పెంచడమనేది జరుగుతుంటుంది. ఒక్కో క్రాఫ్ట్‌ని బట్టి, వారికుండే డిమాండ్‌ని బట్టి రెమ్యునరేషన్ పెంచినా.. అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడరు.. ప్రస్తుతం తెలుగులో స్టార్ సింగర్‌గా కంటిన్యూ అవుతున్న మంగ్లీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్.. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించింది. న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. తెలుగు ఇండస్ట్రీలో టాప్ అండ్ మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా ఎదిగిన మట్టిలో మాణిక్యం మంగ్లీ.. మొదట్లో తెలంగాణ యాసలో పాడేది. తర్వాత బతుకమ్మ పాటలతో పాపులర్ అయింది. తర్వాత సినిమా అవకాశాలు రావడం.. లక్కీగా ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో మంగ్లీ లైఫ్ స్టైల్ మారిపోయింది.
‘రాములో రాములా’, ‘సారంగదరియా’, ‘జింతక్ చితక్’, ‘ఊరంతా’, ‘బుల్లెట్’, ‘జ్వాలారెడ్డి’, ‘కన్నే అదిరింది’, ‘రా రా రక్కమ్మ’ వంటి సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలవడమే కాక యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టాయి. ఇంతగా ఫేమ్ రావడంతో ఒకప్పుడు పాటకు రూ.20 వేలు తీసుకునే మంగ్లీ.. ఇప్పుడు ఒక్కో పాటకు ఏకంగా రూ.2 -3 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. తమ సినిమాలకు ఆమె పాడే పాటలు ప్లస్ అవుతుండడంతో మేకర్స్ కూడా తను అడిగినంత ఇవ్వడానికి వెనుకాడట్లేదట.
అలాగే మంగ్లీకి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. తను పాడి, నిర్మించే పాటలన్నిటినీ అందులో అప్‌లోడ్ చేస్తుంటుంది. దీని ద్వారా కూడా మంచి ఆదాయం వస్తోంది. మరోవైపు నటిగా కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలతో పాటు పాటల్లో కనిపించిన మంగ్లీ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ సింగర్‌గా ఎదిగి పలువురికి ఆదర్శంగా నిలవడం విశేషం.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?