Revanth: నూతన గృహప్రవేశం చేసిన రేవంత్ దంపతులు.. ఫోటోలు వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రేవంత్ ఒకరు. ఈయన ప్లే బ్యాక్ సింగర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బాహుబలి సినిమాలోని మనోహరి పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రేవంత్ అనంతరం ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో కూడా విజయం సాధించారు. ఈ విధంగా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో కొన్నిసార్లు రేవంత్ వింత ప్రవర్తన కారణంగా నెగెటివిటీని కూడా ఎదుర్కొన్నారు. అయితే చివరికి ఈయన బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా బయటకు వచ్చారు. బిగ్ బాస్ తర్వాత తన వృత్తిపరమైన జీవితంలో రేవంత్ బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా రేవంత్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ భార్య అన్విత ఈ గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా (Revanth) రేవంత్ అన్విత దంపతులు సాంప్రదాయమైనటువంటి పట్టు వస్త్రాలను ధరించి గృహప్రవేశం చేశారని తెలుస్తోంది. ఈ విధంగా వీరి గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను అన్విత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus