టాలీవుడ్లో మ్యూజిక్ ఫ్యామిలీలో మరో గాయకుడు ఓ ఇంటివాడయ్యాడు. ఇండియన్ ఐడిల్-9 విజేత, యువ గాయకుడు లోళ్ల వెంకట రేవంత్ శర్మ (రేవంత్) వివాహం చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న రేవంత్ వివాహం జరిగింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో రేవంత్ – అన్విత వివాహం జరిగింది. పరిశ్రమకు చెందిన గాయనీగాయకులు, రేవంత్ స్నేహితులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబర్ 24న రేవంత్ – అన్విత నిశ్చితార్థం జరిగింది. ఆ విషయాన్ని రేవంత్ గతంలో సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఇప్పుడు పెళ్లి విషయం కూడా అలానే తెలిసింది. గాయకుడిగానే కాకుండా, టీవీ కార్యక్రమాల హోస్ట్‌గా కూడా రేవంత్ అందరికీ సుపరిచితుడే. సంగీత కార్యక్రమాల్లో మెంటార్‌గా కూడా వ్యవహరించాడు. రేవంత్ నెటిజన్లు కూడా తమ విషెస్ తెలియజేస్తున్నాడు. మనమూ చెప్పేద్దాం.