Sreerama Chandra: దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి కెసిఆర్ గారు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ శ్రీరామచంద్ర ఒకరు ఈయన సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి మంచి గుర్తింపు పొందడమే కాకుండా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ద్వారా మరింత ఆదరణ సంపాదించుకున్న శ్రీరామచంద్ర ప్రస్తుతం వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సింగర్ గా వ్యాఖ్యాతగా ఇండియన్ ఐడల్ విన్నర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన

ఈయన తాజాగా ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మినిస్టర్ కేటిఆర్ గారికి తన విన్నపాన్ని తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో ఎంతో మంది రాజకీయ నాయకులు తమ పార్టీ పనుల నిమిత్తం బహిరంగ సభలను ఏర్పాటు చేయడం లేదా ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఇలా రాజకీయ నాయకులు రోడ్లపై ఇలాంటి సభలు ర్యాలీలో నిర్వహించడం వల్ల ఎంతో మంది సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే తాజాగా శ్రీరామచంద్ర కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. తాను ఒక కార్యక్రమం నిమిత్తం గోవా వెళ్లాల్సి ఉంది అయితే పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ మొత్తం ఒక పొలిటీషియన్ కోసం బ్లాక్ చేశారని, దీంతో ఫ్లైఓవర్ కింద వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయని తెలిపారు. ఇలా ఫ్లైఓవర్ కింద వెళ్లడంతో అధికంగా ట్రాఫిక్ జామ్ అయిందని దీంతో తను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యానని తెలిపారు.

మరొక ఫ్లైట్ పట్టుకొని గోవా వెళ్లాలంటే చాలా కష్టం తను మాత్రమే కాకుండా మరో ఇద్దరు కూడా ఇదే కారణం చేత ఫ్లైట్ మిస్ అయ్యారని శ్రీరామచంద్ర ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఇలా మీటింగ్ పేరిట రోడ్లను బ్లాక్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ సీఎం కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ కి అదేవిధంగా హైదరాబాద్ పోలీసులకు ఈయన తన విన్నపాన్ని తెలియజేస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus