సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ చైతన్య మోసాలు!

సినిమా అనేది ఒక కలల ప్రపంచం.ఇక్కడ సక్సెస్ అయితే జీవితం స్వర్గం, సక్సెస్ కాకపోతే నరకం. సినిమా పరిశ్రమలో అవకాశం ఇప్పిస్తాను అంటే గుడ్డిగా వెనుకపడేవారు చాలా మంది ఉంటారు. సినిమా పరిశ్రమలో ఎదగాలన్న వీక్ నెస్ చాలా మంది తమ స్వార్దానికి ఉపయోగించుకుంటారు. కాగా సింగర్ సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే చైతన్య అనే ఓ యువకుడు సింగర్ సునీత మేనల్లుడిగా సోషల్ మీడియాలో అనేకమందిని పరిచయం చేసుకున్నాడు.

అలాగే అవకాశాలు ఇప్పిస్తానని నమ్మిన వారి దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇతని మోసాలపై కొందరు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా చైతన్య విషయంపై సింగర్ సునీత ఇలా స్పందించారు…”నేను అందరికీ ఒక విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చైతన్య అనే అతను నా మేనల్లుడు అని చెప్పి, సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని కూడా తెలిసింది.

ఇది తెలిసి నేను షాక్ అయ్యాను. నాకసలు చైతన్య అనే మేనల్లుడు లేనే లేడు. దయచేసి ఇకపై ఎవరూ మోసపోకండి. మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా చెబుతున్నాను. అయినా ప్రతి రోజూ ఇలా ఇండస్ట్రీలో మోసాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి” అన్నారు. ఇటీవల ఓ వ్యక్తి గీతా ఆర్ట్స్ చిత్రాలలో అవకాశాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో గీతా ఆర్ట్స్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus