సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.పేరుగాంచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, లేదంటే సాంకేతిక నిపుణులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటికే నిర్మాత ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి, నటుడు వేణు (Venu Thottempudi) తండ్రి, దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు, దర్శకుడు సూర్య ప్రకాష్, రైటర్ శ్రీ రామకృష్ణ,
క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు, విలన్ రోల్స్ చేసే డేనియల్ బాలాజీ, హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్ ఉమా రామనన్, నటి స్మృతి బిశ్వాస్.. వంటి వారు కన్నుమూశారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్ భర్త అయినటువంటి జానీ చాకో ఉతుప్ మరణించారు. ఆయన వయసు 79 ఏళ్ళు.
వయోభారంతో బాధపడుతూ వస్తున్న ఆయన.. నిన్న కోల్ కతాలో ఉన్న ఆయన నివాసంలో టీవీ చూస్తూనే కన్నుమూసినట్టు సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినా…. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారట. దీంతో ఉషా ఉతుప్ ఫ్యామిలీ విషాదంలో కూరుకుపోయినట్లు అయ్యింది. ఇక ఉషా ఉతుప్ అన్ని భాషల్లోనూ పాటలు పాడి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.