#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘నిను వీడని నీడను నేనే’ (Ninu Veedani Needanu Nene) ‘నేనే నా’ ఫేమ్ కార్తీక్ రాజు (Caarthick Raju) దర్శకత్వంలో రూపొందిన కామెడీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘సింగిల్'(#Single). అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి(Koppineedi Vidya) ఈ సినిమాను నిర్మించారు. చాలా ఏరియాల్లో ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మే 9న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెన్నెల కిషోర్ (Vennela Kishore), శ్రీవిష్ణు..ల కామెడీ వర్కౌట్ అయ్యింది అని అంతా చెప్పుకొచ్చారు.

#Single Collections:

మొదటి రోజు ఎలా ఉన్నా 2వ రోజు నుండి బాగా పికప్ అయ్యింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. రెండో వీకెండ్ కూడా సినిమాలు లేకపోవడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.12 cr
సీడెడ్ 0.58 cr
ఉత్తరాంధ్ర 0.75 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.53 cr
కృష్ణా 0.48 cr
నెల్లూరు 0.18 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 6.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.12 cr (షేర్)

‘సింగిల్’ (#Single) సినిమా రూ.6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 10 రోజుల్లో ఈ సినిమా రూ.8.12 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.12.66 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొత్తంగా రూ.1.52 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది.

‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus