సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 12, 2023 / 11:08 PM IST

Cast & Crew

  • మ‌నోజ్ బాజ్‌పాయ్‌ (Hero)
  • అడ్రిజ (Heroine)
  • సూర్య మోహ‌న్‌, నిఖిల్‌ పాండే, ప్రియాంక సేథియ‌, జైహింద్ కుమార్‌, దుర్గా శ‌ర్మ త‌దిత‌రులు (Cast)
  • అపూర్వ సింగ్ క‌ర్కి (Director)
  • వినోద్ భన్సాలి, క‌మ‌లేష్ భ‌న్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్‌ (Producer)
  • సంగీత్ సిద్దార్థ్ (Music)
  • అర్జున్ కక్రీతి (Cinematography)
  • Release Date : 23 మే, 2023

‘ప్రేమకథ’ ‘హ్యాపీ’ ‘వేదం’ ‘కొమరం పులి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు బాలీవుడ్ విల‌క్ష‌ణ‌ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్. ఈ మధ్య కాలంలో ఇతను మంచి కంటెంట్ ఉన్న వెబ్ మూవీస్ లో ప్రధాన పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన ‘ఫ్యామిలీ మెన్’ ‘ఫ్యామిలీ మెన్ 2’ వంటివి సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇటీవల ఇతను ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. డైరెక్ట్ గా జీ5 ఒటీటీలో రిలీజ్ అయ్యింది ఈ చిత్రం. ఇక తాజాగా తెలుగు వెర్షన్ కూడా ‘జీ5’ లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : గురూజీ అలియాస్ బాబాజీని (సూర్య మోహన్ కులశ్రేష్ట) దేశంలో ఉన్న లక్షల మంది అతన్ని దేవుడిలా కొలుస్తారు. అయితే ఇతని చీకటి కోణం వేరే ఉంటుంది. మైనర్ బాలికలపై ఇతను లైంగిక దాడులు చేస్తుంటాడు. తన అధికారాన్ని భక్తుల్లో ఉన్న భయాన్ని అడ్డం పెట్టుకుని.. తన పై కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అయితే ఊహించని విధంగా ఇతని వల్ల వేధింపులకు గురైన మైనర్ బాలిక(అద్రిజా సిన్హా) పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది.

‘ను’ ఇచ్చిన కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు గురూజీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తారు.అయితే మొదట ఓ లాయర్ ‘ను’ తరపున రంగంలోకి దిగి.. డబ్బు కోసం కేసుని పక్కదోవ పట్టిస్తాడు. ఈ క్రమంలో మనోజ్ బాజ్ బాయ్ ను అప్రోచ్ అవవుతారు ను మరియు ఆమె పేరెంట్స్. అతను పోక్సో చట్టం గురించి బాగా తెలిసిన న్యాయవాది. అయితే ఆ ఫోక్సో చట్టం ఏంటి? చివరికి ను కి న్యాయం జరిగిందా లేదా? అన్నది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : లాయర్ సోలంకి పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ నట విశ్వరూపం చూపించాడు. అలా అని ఇతను ‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్ లా కోర్టు బయట కొట్టడు. సామాన్యమైన లాయర్ గానే కనిపిస్తాడు. ప్రాణం కుటుంబం అంటే ఇతనికి తీపి అన్నట్టే ప్రవర్తిస్తాడు. అందువల్ల మనకి ‘వకీల్ సాబ్’ లో పవన్ కానీ, ‘ జై భీమ్’ లో సూర్య కానీ గుర్తుకురారు. ఎవరి శైలి వారిదే అనిపిస్తుంది. అలాగే సినిమాలో మనోజ్ బాజ్ బాయ్ వన్ మెన్ షో చేశాడు అనిపిస్తుంది.

నూసిన్‌గా చేసిన అడ్రిజ, గురూజీగా (స్వామిజీగా) చేసిన సూర్య మోహ‌న్‌, అమిత్ నిహాగ్‌గా చేసిన నిఖిల్‌ పాండే, నూసిల్ తండ్రి పాత్ర‌లో చేసిన జైహింద్ కుమార్‌, నూసిల్ త‌ల్లి పాత్ర‌లో చేసిన దుర్గా శ‌ర్మ.. వీళ్లంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులు. అయినా కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : 2013 వ సంవత్సరంలో ఆశారాం బాపు కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ కేసుని ఆధారం చేసుకునే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అపూర్వ సింగ్ క‌ర్కి. సినిమా అంతా ఒకే పాయింట్ తో వెళ్తుంది. కానీ ఎక్కడా బోర్ అనిపించదు. పాటలు, ఫైట్స్ వంటివి ఏవీ ఉండవు. కాకపోతే సోలంకి పాత్ర గతం ఏంటన్నది చూపించలేదు.

డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్లిపోయారు. అలాగే చివర్లో వచ్చే పాట పూర్తిగా హిందీలో ఉంది. తెలుగులో ఉండుంటే ఇంకా బాగుండేది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ‘వకీల్ సాబ్’ ‘జై భీమ్’ వంటి సినిమాలు గుర్తొస్తాయి కానీ వాటికి.. ఈ సినిమాకి సంబంధం ఉండదు. ఎంటర్టైన్ చేసే విధంగానే ఉంటుంది.

విశ్లేషణ : మనోజ్ బాజ్ బాయ్ నుండి వచ్చిన మరో మంచి ప్రయత్నం. ‘జీ5 ‘ లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడాల్సిందే.

రేటింగ్ : 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus