Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఫీలింగ్స్ తో గేమ్ ఆడిన సిరి ఎందుకో తెలుసా..?

  • November 6, 2021 / 10:26 AM IST

బిగ్ బాస్ హౌస్ లో సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్ లో భాగంగా సూపర్ విలన్స్ టీమ్ విజయం సాధించింది. అన్ని తాళాలు ఓపెన్ చేసిన విలన్స్ టీమ్ థండర్ ని దక్కించుకుని బోనస్ పాయింట్స్ ని పొందింది. ఇక్కడే విశ్వ, అనిమాస్టర్ థండర్ ని తీస్కునివెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టడంలో విజయం సాధించారు. దీని తర్వాత విలన్స్ టీమ్ అంతా కూడా కెప్టెన్సీ పోటీదారులుగా టాస్క్ ఆడారు. కెప్టెన్సీ పోటీకోసం విలన్స్ టీమ్ అంతా కూడా మ్యాగ్నటిక్ జాకెట్స్ ధరించి ఎదురుగా హౌస్ మేట్స్ విసిరే బంతులని అతుక్కోకుండా చూస్కోవాలి.

వాటినుంచీ తప్పించుకుంటూ చివరి వరకూ ఎవరైతే బరిలో ఉంటారో వాళ్లే ఇంటి కెప్టెన్ అవుతారు. ఇక్కడే సిరి ని షణ్ముక్ టార్గెట్ చేశాడని సపోర్ట్ చేయలేదని గోల చేసింది. మిగతావాళ్లు అందరికీ సపోర్ట్ ఉందని, నువ్వు ఫ్రెండ్ అయ్యి ఉండి ఇలా చేయకూడదని చెప్పింది. ఈగేమ్ లో నేను సంచాలక్ అని, పైగా ప్లేయర్ గా కూడా ఆడానని సపోర్ట్ చేయకూడదన్నట్లుగా షణ్ముక్ మాట్లాడాడు. అయినా కూడా సిరి వినిపించుకోలేదు.

నీది ఫేక్ ఫ్రెండ్షిప్ అని, నీ నుంచీ నేను అస్సలు ఇది ఊహించలేదంటూ దెప్పి పొడిచింది. పక్కనే ఉన్న జెస్సీకి తన వేదన చెప్పుకుని బాధపడింది. ఫ్రెండ్షిప్ వాల్యూ లేదు నీకు, నీది అంతా ఫేక్ అంటూ మాట్లాడింది. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారని, ఇండివెడ్యువల్ గా గేమ్ ఆడితే తప్పేంటి అంటూ షణ్ముక్ సమర్ధించుకున్నాడు. ఇక్కడే చివరకి వరకూ బంతులనుంచీ కాపాడుకుంటూ అనీమాస్టర్ కెప్టెన్ అయ్యింది. అదీ మేటర్.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus