Siri: పెళ్ళి విషయంలో ‘బిగ్ బాస్5’ సిరి ఆలోచన మారిందా..!

‘బిగ్ బాస్5’ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి కంటెస్టెంట్… టాప్ 5 వరకు చేరుకున్న ఏకైక ఫిమేల్ కంటెస్టెంట్ సిరి హనుమంతు.యూట్యూబర్ అయిన సిరి.. పలు వెబ్ సిరీస్ లు, ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘నరసింహపురం’ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మొదటి వారమే కెప్టెన్ అయ్యి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. అయితే మొదటి వారం తర్వాత ఈమె ప్రతీ విషయానికి ఎమోషనల్ అయిపోవడంతో డౌన్ అయిపోయింది.

అంతేకాకుండా మరో యూట్యూబర్ కమ్ కంటెస్టెంట్ అయిన షణ్ముఖ్ తో మితిమీరి హగ్గులు, ముద్దులు వంటి వాటిలో పాల్గొనడంతో ఈమె పై నెగిటివిటీ మరింత పెరిగిపోయింది.నిజానికి షణ్ముఖ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అతని నామినేషన్స్ కు వస్తే ఓట్లు కూడా భారీగా పడేవి. కానీ సిరితో అతని ట్రాక్.. వల్ల అతని పై కూడా నెగిటివిటీ పెరిగిపోయింది. విన్నర్ అవ్వాల్సిన వాడు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.

అయితే షణ్ముఖ్ తో తన రిలేషన్ గురించి సిరి తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను హౌస్ నుండీ బయటకి వచ్చాక..సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే నా పై అలాగే షణ్ముఖ్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ కనిపించాయి. నిజానికి షణ్ముఖ్ నాకు బయట కూడా మంచి ఫ్రెండ్. హౌస్ లో మేము ఎలా ఉన్నామో.. బయట కూడా అలాగే ఉంటాము. అయితే నేను హౌస్ లో షణ్ముఖ్ ని హగ్ చేసుకోవడం వంటివి జనాలకి నచ్చలేదు.

వాళ్ళు ఆ విషయాల్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. బయట నేను, తను కూడా రిలేషన్లో ఉన్నాము. మా పర్సనల్ లైఫ్ గురించి మాకు క్లారిటీ ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన ప్రియుడు శ్రీహాన్ తో వివాహం ఎప్పుడు అని ప్రశ్నించగా.. “అతను ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా నేను హ్యాండిల్ చేయగలను. సినిమాల్లో కూడా నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది సిరి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus