టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. కానీ తర్వాత కొన్నాళ్లుగా ఆయన్ని ప్లాపులు వెంటాడుతూ వచ్చాయి. ‘శాకుంతలం’ (Shaakuntalam) ‘లవ్ మీ’ (Love Me) ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) వంటి సినిమాలు ఆయన్ని నిరాశపరిచాయి. రూ.400 కోట్ల బడ్జెట్ తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అయితే ఆయన్ని ముంచేసే స్టేజికి తీసుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది.
అయితే ‘గేమ్ ఛేంజర్’ తో దిల్ రాజు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమాతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఇది పూర్తిగా దిల్ రాజుని గట్టెక్కించకపోయినా.. కనీసం ఒడ్డున చేర్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దిల్ రాజుకి ‘గేమ్ ఛేంజర్’ ఇచ్చిన షాక్ ఇప్పట్లో మర్చిపోలేనిది అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కెరీర్లో 50వ సినిమా. మైల్ స్టోన్ మూవీగా భావించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు.
అలాగే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. దర్శకుడు శంకర్ (Shankar) లెక్కలేకుండా షూటింగ్లు క్యాన్సిల్ చేసినా.. అన్నీ భరించి షూటింగ్ కంప్లీట్ చేశారు. కానీ కంటెంట్ అనుకున్నట్టు రాలేదు. మరోపక్క పైరసీ వ్యవహారాలు దిల్ రాజుని అస్తవ్యస్తం చేశాయి. అయినా వాటి నుండి కోలుకుని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దిల్ రాజు. కాకపోతే ఈరోజు జరిగిన సక్సెస్ మీట్లో దిల్ రాజు చాలా డల్లుగా కనిపించారు.
అలాగే స్పీచ్ కూడా ఎక్కువగా ఇచ్చింది లేదు. అంతేకాదు ఇచ్చింది చిన్న స్పీచ్ అయినప్పటికీ.. ఎక్కడా కూడా ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. అతని ఆవేదన మొత్తం శిరీష్ వ్యక్తం చేశాడు. ‘మేము పడిపోయాం అని చాలా మంది సంతోషించే టైంలో అనిల్ మమ్మల్ని బయట పడేశాడు’ అంటూ శిరీష్ చెప్పుకొచ్చాడు. గతంలో శిరీష్ (Shirish) ఎప్పుడూ ఇలా మాట్లాడిన సందర్భాలు లేవు. దిల్ రాజు బాధ చూసి అతను గొంతెత్తినట్టు అర్థం చేసుకోవచ్చు.