Mrunal Thakur: సీతారామం సక్సెస్ తో మృణాల్ రెమ్యునరేషన్ పెరిగిందా?

ఈ నెలలో థియేటర్లలో విడుదలైన సీతారామం సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఈ సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ తో మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం మృణాల్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు మృణాల్ ఠాకూర్ కోటి రూపాయల రేంజ్ లో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఒక్క సినిమా సక్సెస్ కే మృణాల్ ఠాకూర్ ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని అయితే తెలుగులో చాలామంది హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ దర్శకనిర్మాతలలో చాలామంది మృణాల్ ను తమ సినిమాలలో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ మరాఠీలో పలు సినిమాలు చేయడంతో పాటు చిన్నచిన్న సినిమాలలో నటించారు.

హిందీ జెర్సీలో మృణాల్ ఠాకూర్ నటించగా సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా జెర్సీ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు. మృణాల్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే ఆమె క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మృణాల్ ఠాకూర్ ఆచితూచి ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గ్లామర్ రోల్స్ కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మృణాల్ కు స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus