Sitara, Mahesh: మహేష్ రియల్ క్యారెక్టర్ ను బయటపెట్టిన సితార!

మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీని పెంచుకున్న సితార సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నారు. పెన్నీ సాంగ్ లో సితార వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సితార ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండటం తనకు ఇష్టమని వీడియోలు చేయడం ఎగ్జైటింగ్ ఉంటుందని సితార పేర్కొన్నారు.

Click Here To Watch NOW

పెన్నీ సాంగ్ నాకు తొలి సాంగ్ కావడంతో కెమెరా ముందు అందంగా కనిపించనేమోనని భయపడ్డానని సితార చెప్పుకొచ్చారు. డ్యాన్స్ మాస్టర్లతో కలిసి పెన్నీ సాంగ్ కు స్టెప్పులు వేయడం సరదాగా అనిపించిందని సితార పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూల్, హోమ్ వర్క్ తో బిజీగా ఉన్నానని సితార చెప్పుకొచ్చారు. అమ్మతో, నాన్నతో ఒకేలా ఉంటానని ఏ విషయం గురించైనా ఇద్దరితో పంచుకుంటానని సితార కామెంట్లు చేశారు. అన్నయ్య గురించి ఫిర్యాదు చేయాలని అనుకుంటే మాత్రం మొదట అమ్మకు చెబుతానని సితార పేర్కొన్నారు.

బీటిల్స్ సాంగ్స్ నాకు చాలా ఇష్టమని అనీ మాస్టర్, అరుణా భిక్షు దగ్గర తాను డ్యాన్స్ నేర్చుకుంటున్నానని సితార వెల్లడించారు. తన వీడియోలను అమ్మ షూట్ చేస్తుందని సితార అన్నారు. ఫోటో షూట్స్ కు ఒక స్టైలిష్ట్ ఉన్నాడని అతనే దుస్తులను ఎంపిక చేస్తాడని సితార వెల్లడించారు. ఇంట్లో తాను ఎక్కువగా చిలిపి పనులు చేస్తానని సితార అన్నారు. నాన్న ఎప్పుడూ హ్యాపీగా ఉంటారని నాన్నకు అసలు కోపమే రాదని సితార పేర్కొన్నారు.

భవిష్యత్తులో తాను నటిని అవుతానో లేదో ఇప్పుడే చెప్పలేనని సితార కామెంట్లు చేశారు. నాకు హోలీ పండుగ అంటే చాలా ఇష్టమని సితార అన్నారు. చదువు, మార్కుల విషయంలో లక్ష్యాలను పెట్టుకుంటానని సితార కామెంట్లు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus