Sitara: ఆ విషయంలో సితారకు ఎవరూ సాటిరారుగా.. టాలెంటెడ్ అంటూ?

మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సితార ఇతర సెలబ్రిటీల పిల్లలకు భిన్నంగా అడుగులు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సీతూ పాప ముగ్గులు వేస్తుండగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సితార షేర్ చేసిన ఈ ఫోటోకు 2 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. నైస్ రంగోలి అంటూ నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి విషయంలో తన టాలెంట్ ను ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకోవడంలో సితారకు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సితారకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం సులువుగా స్టార్ స్టేటస్ సొంతమవుతుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సితార సినిమాల్లో నటిస్తానంటే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

మహేష్ బాబు, సితార కాంబినేషన్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలకు సంబంధించి సీతూ పాప మనస్సులో ఏముందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. సితార ఇష్టాన్ని మహేష్ దంపతులు సైతం ఎంతగానో గౌరవిస్తారు. సితార ఇప్పటికే పలు యాడ్స్ లో నటించి ఆ యాడ్స్ ద్వారా ప్రశంసలు అందుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 16 లక్షల ఫాలోవర్లతో సీతూ పాప నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు.

యూట్యూబ్ వీడియోల ద్వారా (Sitara) సీతూ పాప అభిమానులను మరింత ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సితార కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తారని సినిమాల్లో సంచలనాలను సృష్టిస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. మహేష్ బాబు విషయానికి వస్తే మరో 60 రోజుల్లో గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడం గమనార్హం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus