Sitara: సితార ఘట్టమనేని ఒక యాడ్ కి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?

మహేష్ బాబు (Mahesh Babu) గారాలపట్టి సితార ఘట్టమనేని అందరికీ సుపరిచితమే. ఈమె సినిమాల్లో నటించింది ఏమీ లేదు. కానీ సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 12 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కూతురు ఆద్యతో కలిసి ఈమె సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈమె ఫాలోవర్స్ సంఖ్య చూసి.. ఓ జ్యువెలరీ సంస్థ.. తమ బ్రాండ్ కు ప్రచారకర్తగా సితారని (Sitara) పెట్టుకుంది.

Sitara

అందుకోసం ఈమె యాడ్స్ లో పాల్గొంటుంది కూడా. మరోపక్క ఓ క్లోతింగ్ బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేస్తుంది. అందులో తన తండ్రి మహేష్ బాబుతో కలిసి నటించింది. అది బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగా… సితార ఘట్టమనేని ఇప్పుడు మరో 2,3 యాడ్స్ లో కూడా నటించేందుకు రెడీ అయ్యిందట. వీటి కోసం ఆమె పారితోషికం కూడా గట్టిగానే తీసుకుంటుంది అని టాక్.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం సితార రూ.30 లక్షలు పారితోషికంగా తీసుకుంటుందట. దీనికి జీఎస్టీ కూడా అదనం అని తెలుస్తుంది. ఈ రేంజ్ పారితోషికం సాధారణంగా స్టార్ హీరోయిన్లకి మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ సితార ఒక్క సినిమాలో నటించకపోయినా.. ఇంత మొత్తం ఎందుకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

దానికి కారణం లేకపోలేదు. సితార ప్రమోట్ చేసే బ్రాండ్లకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వంటివి మహేష్ బాబు సోషల్ మీడియా ఖాతాల్లో కూడా షేర్ చేస్తూ ఉంటారు. నమ్రత కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే స్టార్ కిడ్ సితారకి అంత మొత్తం పారితోషికం ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది.

‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్.. ఆ బాటిల్ ఏంటి? దాని కథ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus