Jr NTR: ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్.. ఆ బాటిల్ ఏంటి? దాని కథ ఏంటి?

ఉగాది కానుకగా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి లాభాలను అందుకుంది. రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోవడానికి.. ఒక విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi). దీనికి మరింత పుష్ ఇచ్చేందుకు స్టార్ హీరో ఎన్టీఆర్..ని అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఎంత హైలెట్ అయ్యిందో అందరికీ తెలుసు.

Jr NTR

‘మ్యాడ్ స్క్వేర్’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున అభినందించారు ఎన్టీఆర్(Jr NTR) . అయితే ఈ ఈవెంట్లో మరో రకంగా కూడా ఎన్టీఆర్ (Jr NTR) హాట్ టాపిక్ అయ్యారు. నిన్న ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్.. తన బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) పక్కన కూర్చుని ఏదో తాగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొంతమంది ఎన్టీఆర్.. మద్యం సేవిస్తున్నట్టు అపోహ పడుతున్నారు. చూడటానికి ఆ బాటిల్ కూడా అలానే కనిపిస్తుంది.

కానీ అందరూ అనుకుంటున్నట్టు అది మద్యం బాటిల్ కాదు. అది మినరల్ వాటర్ బాటిల్. దాని పేరు ‘రిఫ్రెషింగ్ పెరియార్ స్పర్క్లింగ్ నేచురల్ మినరల్ వాటర్’ అని తెలుస్తుంది. డైట్ లో ఉన్న వాళ్ళు ఈ వాటర్ తీసుకుంటారట. వీటిలో కేలరీలు ఉండవట. చాలా ప్యూర్ వాటర్ అని తెలుస్తుంది. ఈ బాటిల్ ధర రూ.480 అని తెలుస్తుంది. ఒక కేస్ కి 12 బాటిల్స్ వరకు వస్తాయి. మొత్తంగా రూ.5760 అవుతుందని స్పష్టమవుతుంది.

గిల్లుడు సరదా మరచిపోని ఎన్టీఆర్‌.. స్టేజీ మీద ‘మ్యాడ్‌’గా..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus