కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ కష్టాలలో ఉన్న పుట్టింటి వారికి సహాయం చేయాలని ఆరాటపడుతున్న కూతురి గురించి ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ ఏం జరిగిందనే విషయానికి వస్తే… కావ్య పుట్టింటి వారికి సహాయం చేయడాన్ని ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు. దీంతో తనని హాల్లో నిలబెట్టి తనది తప్పు అంటూ ప్రతి ఒక్కరు తనపై అరుస్తూ ఉంటారు. ఇకపోతే కావ్య మాట్లాడుతూ కష్టాలలో ఉన్న మా అమ్మ వాళ్లకు సహాయం చేయాలనుకోవడం తప్ప ఎలా అవుతుంది అంటూ అందరిపై అరుస్తుంది.
ఇక చిట్టి కూడా చేసినది ఇంట్లో వారికి చెప్పు చేయొచ్చు కదా అమ్మ అంటూ మాట్లాడుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కావ్య తప్పు చేసిందని నిలదీస్తూ ఉంటారు. ఇక అపర్ణ కూడా తనపై అరుస్తూ మేము చెప్పినట్లు నడుచుకొని ఈ ఇంట్లో ఉంటానంటే ఉండు లేదంటే నీకు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత కూడా లేదు అంటూ అపర్ణ మాట్లాడుతుంది. అంతలోపే అక్కడికి సీతారామయ్య వచ్చి ఆపుతారా ఇక మీరందరూ ఎందుకు ఆ అమ్మాయిని అలా తప్పుపడుతున్నారు అన్ని విషయాలు తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను అంటూ మాట్లాడుతారు.
ఆ అమ్మాయి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన ఇంటి పరువు తీసింది కదా నాన్న అంటూ రుద్రాన్ని మాట్లాడటంతో ముందు నువ్వు మాట్లాడటం ఆపు ఆ అమ్మాయి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మన ఇంటి గురించి గొప్పగా చెప్పింది అంటూ సీతారామయ్య తనకు మద్దతు తెలుపుతూ మాట్లాడతారు. కావ్యకు ఆత్మాభిమానం ఎక్కువ అపర్ణ పుట్టింటికి డబ్బు పెడుతున్నావు అని అన్నప్పుడే ఈ అమ్మాయి ఈ ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోదని నాకు అర్థం అయ్యింది.
పుట్టింటి వారు కష్టాల్లో ఉన్నారని వారి కష్టాలు తీర్చడానికి కాదు కష్టపడుతూ ఉంటే తనకు మనం తనకు సపోర్ట్ గా ఉండాలని చెబుతారు . సీతారామయ్య కావ్యకు మద్దతు తెలపడంతో అందరూ కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతారు.ఈ కావ్య బయటకు వెళ్ళిపోతుంది అనుకుంటే చివరి క్షణంలో ఈ ముసలోడు వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టారని రాహుల్ రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు బాధతో కృష్ణమూర్తి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి కనకం ప్రస్తుతం కావ్య కాపురం ఏమవుతుందోనని కంగారుగా ఉందని మాట్లాడుతుంది.
ఇంటిని అమ్మేస్తానంటే బాధపడ్డాను కానీ కావ్య కాపురం చెడిపోతుంది అంటే ఇంటిని అమ్మేసి అప్పు తీర్చి చిన్నదానికి పెళ్లి చేసేద్దాం అని మాట్లాడుకుంటారు. మరోవైపు కావ్య పడుకోవడానికి కష్టం మీద బెడ్ కిందకి దించుతూ ఉండగా రాజ్ వెళ్లి తనకు సహాయం చేస్తారు. వెనక అవమానించడం ముందు సహాయం చేయడం ఏంటి అని మాట్లాడుతుంది. దాంతో రాజ్ తాతయ్య సపోర్ట్ చూసుకొని రెచ్చిపోతున్నావేమో నువ్వు నీ పుట్టింటికి వెళ్లడానికి నేను ఒప్పుకోను అంటూ రాజ్ మాట్లాడటంతో కావ్య సరే అని పడుకుంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతారు ఏంటి ఇంత తొందరగా కాంప్రమైజ్ అయింది దీని వెనక ఏదో ఉంటుందని ఆలోచిస్తూనే ఉంటాడు.
అయితే తనకు ఏం ప్లాన్ చేస్తుందో తెలియక నిద్ర పట్టక నిద్రపోతున్న కావ్యను లేపి మరి ఇంత సింపుల్ గా ఎలా ఒప్పుకున్నావు అంటూ కావ్యను అడగడంతో తనేమీ మాట్లాడకుండా పడుకునేస్తుంది. మరుసటి రోజు ఉదయం బయట కావ్య పని చేస్తూ ఉండగా సీతారామయ్య అక్కడే కూర్చుని ఉంటాడు తనని తన పుట్టింటికి వెళ్ళమని చెబుతాడేమోనని కావ్య ఎదురుచూస్తూ ఉంటుంది కానీ సీతారామయ్య తనని గమనించడు అలాగే పక్కనే రాజ్ కూడా పేపర్ చదువుతూ ఉండగా కావ్య వెళ్లి ఆ పేపర్ లాక్కొని సీతారామయ్య గారికి ఇస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi) పూర్తి అవుతుంది.