Siva Balaji: శివ బాలాజీ చేసిన పని విని ‘ఛీ’ అన్న వెన్నెల కిషోర్‌.. ఏమైందంటే?

టాలీవుడ్‌లోని ప్రేమకథల్ని వినూత్నంగా బుల్లితెరపై ఆవిష్కరిస్తున్నారు వెన్నెల కిషోర్‌. ఈటీవీలో ‘అలా మొదలైంది’ అంటూ ఓ టాక్‌ షో నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీలోని యువ దర్శకులు, హీరోల ప్రేమ కావ్యాలు ఇలా బయటకు వస్తున్నాయి. తాజాగా చాలా పాత ప్రేమకథ ఒకదాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే శివబాలాజీ, మధుమిత ప్రేమకథ. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేదని ఈ ఇద్దరూ ఈ షోకి వచ్చారు. ఈ క్రమంలో వారి వెరైటీ ప్రేమకథను పంచుకున్నారు.

సినిమాల్లో నటిస్తున్నప్పుడు అయిన పరిచయంతో శివబాలాజీ – మధుమిత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రేమ ప్రపోజల్ తొలుత శివ బాలాజీ నుండే వచ్చిందట. అయితే అంతకుముందు ఓసారి లిప్ స్టిక్ వేసుకుని పెదాలను అద్దిన టిష్యూ పేపర్‌ను శివ బాలాజీ తీసుకుని దాచి పెట్టుకున్నాడని మధుమిత చెప్పారు. ఆ మాటలకు వెన్నెల కిషోర్‌ సెటైరికల్‌ ‘ఛీ ఛీ’ అన్నాడు. అయితే వారి మధ్య మంచి స్నేహం ఉండటం విశేషం.

2004లో ‘ఇంగ్లీస్‌ కారన్‌’ అనే సినిమా షూటింగ్‌లో శివ బాలాజీతో మధుమితకు పరిచయం అయ్యిందట. ఆ సినిమా దర్శకుడు శక్తి సిదంబరన్‌ వల్లనే తమ మధ్య ప్రేమ పుట్టిందని ఇద్దరూ చెప్పుకొచ్చారు. ఆయన క్రియేట్ చేసిన ఓ రూమర్‌తోనే తమ మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగిందని, ఆ తర్వాత అది ప్రేమ అయిందని చెప్పుకొచ్చారు. తమ మధ్య లవ్ ప్రపోజల్స్ ఏమీ లేవని, డైరెక్ట్‌గా పెళ్లి గురించే మాట్లాడుకున్నామని తెలిపారు.

పెళ్లికి శివబాలాజీ (Siva Balaji) ఇంట్లో ఒప్పుకున్నా, తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని మధుమిత తెలిపారు. ఇండస్ట్రీ వాళ్లు వద్దు అనే ఆలోచచనలో తమ కుటుంబ సభ్యులు ఉండేవారని చెప్పారు. కానీ, చివరకు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నామన్నారు. ప్రోమో ఆఖరున మంచు విష్ణు, వెన్నెల కిషోర్ మధ్య ఫన్నీ ఫోన్ కాల్ కూడా చూడొచ్చు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus