Sivaji: ఇండస్ట్రీ రీ ఎంట్రీ పై శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు. అనంతరం ఇండస్ట్రీకి దూరమైనటువంటి శివాజీ బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈయనే విన్నర్ అవుతారని అందరూ భావించారు. కానీ శివాజీ మాత్రం టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు. ఇక ఈయన టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు రావడంతో తన కొడుకు రిక్కి ఎంతో ఎమోషనల్ అవుతూ స్టేజ్ పైన ఏడ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఆ సమయంలో తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అందుకే కన్నీళ్లు పెట్టుకున్నారు అంటూ శివాజీ పలు సందర్భాలలో వెల్లడించారు. ఏ కొడుకు కూడా తన తండ్రి ఓడిపోకూడదు అనే కోరుకుంటాడు అయితే ఆ విషయాన్ని రిక్కి ఇప్పుడు మర్చిపోయి తన స్టడీస్ పై ఫోకస్ పెట్టారని శివాజీ అన్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రేక్షకులు అందరూ కూడా ప్రశాంత్ ని గెలిపించాలని కోరుకున్నారు.

అందుకే తానే విన్నర్ అయ్యారు అంటూ శివాజీ వెల్లడించారు ఇకపోతే తిరిగి ఇండస్ట్రీలోకి రావడం గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురవగా పలు విషయాలను వెల్లడించారు. తాను సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని శివాజీ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక తాను హీరోగా మాత్రమే నటించాలని కోరుకోను పాత్రకు ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో అయినా కూడా నేను నటించడానికి సిద్ధంగానే ఉన్నానని ఈయన వెల్లడించారు. తనకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందని అలాంటి పాత్రల కోసమే తాను ఎదురుచూస్తున్నానంటూ ఈ సందర్భంగా (Sivaji) శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus