Sivakarthikeyan: గడ్డం వల్ల డైరెక్టర్ తో గొడవ పడ్డ శివ కార్తికేయన్.. సెట్స్ నుండీ వాకౌట్..!

గడ్డం విషయంలో అల్లు అర్జున్ (Allu Arjun)  , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా కొద్దిరోజుల పాటు వార్తల్లో నిలిచింది. దర్శకుడు సుకుమార్ పై కోపంతో హీరో అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసుకుని.. షూటింగ్ నుండీ వాకౌట్ చేశాడని, ఆ తర్వాతి రోజు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. కొద్దిరోజుల పాటు వాటి హవా నడిచింది. తర్వాత ‘అలాంటిదేమీ లేదు’ అని బన్నీ, సుకుమార్..లు వాటిని డైవర్ట్ చేసేశారు.

Sivakarthikeyan

తాజాగా ఇలాంటి సమస్యే తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) డైరెక్టర్ పై కోపంతో సెట్స్ నుండి బయటకి వెళ్ళిపోయాడట. వివరాల్లోకి వెళితే.. శివ కార్తికేయన్ తన 25వ సినిమాని ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతో (Sudha kongara Prasad) చేయాల్సి ఉంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో ‘జయం’ రవి (Jayam Ravi) విలన్ గా నటించబోతున్నాడు అని తమిళంలో టాక్ గట్టిగా నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా దర్శకురాలు సుధ కొంగర టెస్ట్ షూట్ కి ఏర్పాట్లు చేసుకుంది. శివ కార్తికేయన్ దీనికి హాజరయ్యాడు. అయితే తన సినిమా కోసం క్లీన్ గా ట్రిమ్ చేసుకుని ఉండాలని సుధ.. ముందుగా శివ కార్తికేయన్ కి చెప్పిందట. అయితే మరో సినిమా షూటింగ్లో ఉన్న శివ కార్తికేయన్ ప్రస్తుతం టెస్ట్ షూట్ కదా అని..ట్రిమ్ చేసుకోకుండా యధావిధిగా వచ్చేసాడట. ఇందుకు సుధ కొంగర ఒప్పుకోలేదు. వెంటనే ట్రిమ్ చేసుకుని రావాల్సిందిగా కోరిందట.

అంతేకాకుండా ‘కార్తీ (Karthi) మొదటి సినిమా పరుత్తివీరన్(తెలుగులో మల్లిగాడు) లో మాదిరి పిచ్చి పిచ్చిగా ఉంది నీ గడ్డం’ అన్నట్టు కామెంట్ చేసిందట. దీంతో శివ కార్తికేయన్ కి కోపం వచ్చి అక్కడి నుండి వాకౌట్ చేశాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత సుధ కొంగర ఎన్నిసార్లు శివ కార్తికేయన్ కి కాల్ చేసినా అతను ఆన్సర్ చేయలేదట. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.

బ్లాక్ బస్టర్ పాటపై తమన్నా అలా అనేసిందేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus