Tamannaah: బ్లాక్ బస్టర్ పాటపై తమన్నా అలా అనేసిందేంటి?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్’  (Jailer)  చిత్రం గత ఏడాది ఆగస్టు 10న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మొదట్లో అంత బజ్ ఏర్పడలేదు. ఎందుకంటే.. ‘జైలర్’ కి ముందు నెల్సన్ డైరెక్ట్ చేసిన ‘బీస్ట్’ (Beast) చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ సినిమా విషయంలో విజయ్ (Vijay Thalapathy) ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. దీంతో ‘నెల్సన్ తో సినిమా వద్దు’ అంటూ రజినీకాంత్ ఫ్యాన్స్ గోల చేశారు.

Tamannaah

అయినా రజనీ నెల్సన్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే మొదట ఈ సినిమాకి అంతగా బజ్ ఏర్పడలేదు. అయితే ఎప్పుడైతే ‘కావాలయ్యా’ సాంగ్ రిలీజ్ అయ్యిందో.. అప్పటి నుండి ‘జైలర్’ పై అంచనాలు పెరిగాయి. ఆ సాంగ్ దేశవ్యాప్తంగా బాగా ట్రెండ్ అయ్యింది. అది కూడా చాలా షార్ట్ టైంలో..! అటు తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ‘జైలర్’ కి హైప్ పెరగడంలో ‘కావాలయ్యా’ పాట కాంట్రిబ్యూషన్ చాలా ఉంది.

తమన్నా (Tamannaah Bhatia)  ఈ పాటలో నర్తించింది. అయితే ఈ పాట గురించి తాజాగా ఆమె చేసిన కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి అని చెప్పాలి. తమన్నా మాట్లాడుతూ..” ‘కావాలయ్యా’ పాటకు నేను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేదు. ఆ పాటలో ఇంకా బాగా చేసుండొచ్చు. ఆ ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉంది. ఆ పాట విషయంలో నేను డిజప్పాయింట్ అయ్యాను. అయితే హిందీలో చేసిన ‘స్త్రీ 2’ (Stree 2)  లో నేను చేసిన ‘ఆజ్ కి రాత్’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట అయితే నాకు సంతృప్తినిచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది.

అజిత్‌ సినిమాకు ‘కాపీ’ కష్టం.. రూ.125 కోట్లు కట్టమంటూ నోటీసులొచ్చాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus