శివ కార్తికేయన్ మెల్ల మెల్లగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తుంది. ‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ వంటి చిత్రాలు తెలుగులో కూడా మంచి హిట్ అయ్యాయి. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ స్ట్రైట్ తెలుగు మూవీ కూడా చేయబోతున్నాడు శివ కార్తికేయన్.ఇది ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. ఇదిలా ఉండగా.. శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘డాన్’ మే 13న తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అసలు ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు జనాలకి తెలియదు.
కనీసం ప్రమోషన్లు చేసింది కూడా లేదు.కానీ బాక్సాఫీస్ వద్ద ఆల్రెడీ హిట్ స్టేటస్ ను దక్కించుకుంది. సి.బి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’ వారితో కలిసి శివ కార్తికేయన్ నిర్మించాడు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం ప్లస్ అయ్యింది. ఒకసారి ‘డాన్’ 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.62 cr
సీడెడ్
0.20 cr
వైజాగ్
0.20 cr
ఈస్ట్+వెస్ట్
0.15 cr
కృష్ణా+ గుంటూరు
0.15 cr
నెల్లూరు
0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.42 cr
శివ కార్తికేయన్ ‘డాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు అంత మొత్తం రాబట్టాల్సి ఉంది. 8రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.42 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగా కలెక్ట్ చేసింది.
మంచి మౌత్ టాక్ కూడా ‘డాన్’ కు కలిసొచ్చింది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రూ.0.12 కోట్ల లాభాలను కూడా అందించింది. ‘డాక్టర్’ తర్వాత శివకార్తికేయన్ కు ‘డాన్’ రూపంలో మరో హిట్టు దక్కినట్టు అయ్యింది.