Sivani Rajasekhar: కెరీర్‌ స్టార్టింగ్‌ గురించి ఓపెన్‌ అయిన శివాని!

స్టార్‌ కిడ్స్‌కేంటి లైఫ్‌ సూపర్‌ అంటుంటారు ఇండస్ట్రీలో. అయితే వాళ్ల స్ట్రగుల్స్‌ వాళ్లకు ఉంటాయి. నెపోటిజం అంటూ నోరు చేసుకుంటుంటారు. కానీ అవకాశాలు కోసం వాళ్ల పడ్డ కష్టాలు, దాటిన అవరోధాలు చాలామందికి కనిపించవు. తాజాగా అలాంటి కష్టాలు దాటి తొలి సినిమా విడుదల అవుతున్న కథానాయిక శివానీ రాజశేఖర్‌. రెండు సినిమాలు మొదలై… మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు మూడో సినిమా ఓటీటీలో విడుదలవుతోంది. ‘‘నేను, శివాత్మిక ఒడుదొడుకులు దాటుకొనే తెరపైకి వచ్చాం.

చిన్నతనం నుండి అమ్మానాన్నలతో పరిశ్రమలో తిరగడం వల్ల దర్శక నిర్మాతలతో పరిచయాలు ఉన్నాయి. ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలం. అయితే అవకాశాలు విషయంలో అందరిలాగే కష్టపడాల్సిందే. నేను, శివాత్మిక చాలా ఆడిషన్లు ఇచ్చాం. రిజక్ట్ కూడా అయ్యాం. నాది బ్యాడ్‌లక్కా, లేకపోతే ఐరెన్‌ లెగ్గా అని ఒక్కోసారి అనిపించేది అంటూ బాధపడింది శివానీ. నా తొలి రెండు చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఆగిపోవడంతో ఒకానొక సమయంలో ఒత్తిడికి గురయ్యా. నాకే ఎందుకిలా జరుగుతుంది, నేనే సినిమా మొదలు పెట్టినా ఆగిపోతోంది అని బాధేసేది.

మా ఇంట్లో వాళ్లు అయితే సరదాగా ‘శివానీ ఎప్పుడూ బిజీనే… కానీ సినిమా విడుదలవ్వట్లేదు’ అనేవాళ్లు. మరోవైపు ఇండస్ట్రీలో మరో సమస్య. ‘‘ఇలాంటి కథలు వీళ్లు చేస్తారా? గ్లామర్‌ రోల్స్‌కి వీళ్లను అడగొచ్చా? ఇలాంటి చిన్న సినిమా చేస్తారా? ఎక్కువ రెమ్యూనరేషన్‌ అడుగుతారేమో’’ అని అనుకుంటుంటారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus