Sivashankar, Silk Smitha: నాటి గొడవ గురించి శివశంకర్‌ మాస్టర్‌ ఏమన్నారంటే?

టాలీవుడ్‌లో బెస్ట్‌ ఫిమేల్‌ డ్యాన్సర్స్‌లో సిల్క్‌ స్మిత ఒకరు. గ్రేస్‌, అందం, స్టెప్‌లు… ఇలా అన్నింటా మేటి అనిపించుకున్న డ్యాన్సర్లలో ఆమె ఒకరు. అలాంటి సిల్క్‌ స్మితతో దివంగత శివశంకర్‌ మాస్టర్‌తో గొడవ జరిగిందని తెలుసా? ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైంది లాంటి విషయాలను ఆ మధ్య చెప్పుకొచ్చారు శివశంకర్‌ మాస్టర్‌. ఇదంతా జరిగింది ‘భలే తమ్ముడు’ సినిమాతో. సిల్క్‌ స్మిత అంటే నాకు కోపం లేదు. ఎందుకో ఆవిడే మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు.

దాంతో మాకు బాధ అనిపించింది. బాలకృష్ణ ‘భలేతమ్ముడు’లో నాలుగు పాటలు చేశారట శివశంకర్‌ మాస్టర్‌. అయిదో పాట కోసం స్మితతో రిహార్సల్స్‌ చేసి ఇంటికి వస్తుంటే ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి ఫోన్‌ చేశారట. ‘మాస్టర్‌ గారు మీకూ, స్మితకు ఏంటి గొడవ. మీరుంటే చేయనంటున్నారు’ అని అడిగారట. ఏమో నాకు తెలియదు అన్నారట శివశంకర్‌ మాస్టర్‌. అంతేకాదు సరోజ అనే ఆవిడను రికమెండ్‌ చేశారట. కానీ నిర్మాతల ఆలోచన వేరేలా ఉంది. శివ శంకర్‌ మాస్టరే కావాలి.

సిల్క్‌ స్మిత చేస్తుందో లేదో కనుక్కోండి. ఒకవేళ చేయనంటే బాలయ్య బాబుకి చెప్పి వేరే వాళ్లను పెట్టండి అన్నారట. అలా జయమాలినిని పెట్టి ఆ పాట తీశారట. అయితే ఆ తర్వాతి నుండి స్మిత సినిమాలకు పని చేయకూడదని సుందరం మాస్టర్‌, శివశంకర్‌ మాస్టర్‌ అనుకున్నారట. అదీ జరిగింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus