అనాటి కాలంలో స్టార్ హీరోయిన్ వెలుగొందిన తార జయప్రద. అప్పటి స్టార్ హీరోల సరసన నటించి.. ప్రేక్షకులను మెప్పించింది జయ ప్రద. అయితే ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలింది. రాజకీయాల్లోనూ ఎంపీగా చేసిన జయప్రదకు ఓ విషయంలో న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఆ వివరాల్లోకి వెళితే… సీనియర్ హీరోయిన్ జయ ప్రద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె 1974లోనే భూమి కోసం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. ఇక స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్స్ కొట్టేసి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయింది జయసుధ. అయితే ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జయ సుధ ఈ మధ్య రాజకీయాల్లో బిజి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె అప్పటి ఎన్నికల్లో ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం మాజీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో జయ ప్రదకు ఊహించని షాక్ తగిలింది. ఆమెకు చెన్నైకు చెందిన ఎగ్మోర్ కోర్టు.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను ఎగ్మోర్ కోర్టు విధించింది. ఆమెతో పాటు ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ ఎగ్మోర్ కోర్టు తీర్పును ఇచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం అనంతరం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 5 వేల చొప్పున జరిమానా విధించింది న్యాయస్థానం.
చెన్నై రాయపేటలో గతంలో జయప్రద (Jayaprada) చెందిన సినిమా హాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలోనే.. ఎగ్మోర్ కోర్టులో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వ్యాజ్యం దాఖలు చేసింది. ఇక తాజాగా ఆ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు… సీని నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను విధించింది.
సినీ, రాజకీయ రంగాల్లో చురుగ్గా పాల్లొంటున్న జయప్రదకు ఈ తీర్పుతో ఊహించని షాక్ తగిలినట్టైంది. ఆమె అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జయప్రద… ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే కామెడీ షోలో జడ్జ్ గా పాల్గొంటున్నారు. ఆమె చాలా కాలం తర్వాత బుల్లితెరపై కనిపించడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ తీర్పుతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.