Pushpa Movie: పుష్ప విలన్ పాత్రను రిజెక్ట్ చేసిన ఆరుగురు స్టార్ హీరోలు వీళ్లే?

క్రియేటివ్ డైరెక్టర్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప . ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ విడుదలైనప్పటికీ ఇప్పటికీ పుష్ప సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది. ఇక అల్లు అర్జున్ తో పాటు సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజల్ పాత్ర కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప సినిమాలో ఈయన చివరిలో బన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈయన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఈయన నటన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక పుష్ప 2 సినిమాలు అల్లు అర్జున్ ఫహద్ ఫాజిల్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతోందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఫహద్ కన్నా ముందుగా విలన్ పాత్రలో నటించడం కోసం 6 మంది హీరోలను సంప్రదించగా వారందరూ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. మరి ఈ సినిమా రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే…

పుష్ప సినిమాలో విలన్ పాత్రలో ముందుగా నటుడు విక్రమ్ అయితే బాగుంటుందని అనుకున్నారట. విక్రమ్ ని సంప్రదించి ఈ పాత్ర గురించి చెప్పగా ఆయన ఎంతో సున్నితంగా ఈ పాత్రను రిజెక్ట్ చేశారు. అనంతరం విజయ్ సేతుపతిని సంప్రదించగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల ఈయన ఈ సినిమాలో నటించలేకపోయారు. ఇక కోలీవుడ్ హీరోలు మాధవన్ ఆర్య వంటి హీరోలకి కూడా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ హీరోలు సైతం ఈ సినిమాని వదులుకున్నారు.

ఈ విధంగా ఈ హీరోలు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా చివరికి భీష్మ’ విలన్ జిష్షు సేన్‌గుప్తా వద్దకు వెళ్లినప్పటికీ ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఇంతమంది రిజెక్ట్ చేయడంతో సుకుమార్ చివరికి నటుడు ఫహద్ ఫాజిల్ నీ సంప్రదించడంతో చివరికి ఆయన ఈ పాత్రకు ఓకే చేశారు. ఇలా ఇంతమంది రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశాన్ని అందుకున్న ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus