Skanda Collections: ‘స్కంద’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘స్కంద’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ , పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ‘స్కంద’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సెప్టెంబర్ 28 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే సాధించింది. అలా అని బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేకపోయింది.ఒకసారి ‘స్కంద’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 11.05 cr
సీడెడ్ 4.27 cr
ఉత్తరాంధ్ర 3.68 cr
ఈస్ట్ 2.29 cr
వెస్ట్ 1.51 cr
గుంటూరు 2.66 cr
కృష్ణా 1.61 cr
నెల్లూరు 1.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 28.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.71 cr
ఓవర్సీస్ 2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 33.03 cr (షేర్)

‘స్కంద’ (Skanda) చిత్రానికి రూ. 42.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.43 కోట్లు షేర్ ని వసూలు చేయాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.33.03 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.9.97 కోట్ల నష్టాలతో ప్లాప్ సినిమాగా మిగిలింది. అయినప్పటికీ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన మూవీగా కూడా నిలిచింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus