ఈ ఏడాది ‘తిమ్మరుసు’ చిత్రంతో ఓ మినీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్.. ఇప్పుడు ‘స్కైలాబ్’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డిసెంబర్ 4న..ఈ చిత్రం విడుదలయ్యింది. నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాయ శర్మ, తనికెళ్ళ భరణి, అరిపిరాల సత్యప్రసాద్, నారాయణరావు, తులసి, తరుణ్ భాస్కర్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. అయితే ‘అఖండ’ బాక్సాఫీస్ జాతర వల్ల సత్యదేవ్ ‘స్కైలాబ్’ ను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. శనివారం విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ సో సో అన్నట్టే నమోదయ్యాయి.
వాటి వివరాలను గమనిస్తే :
నైజాం | 0.21 cr |
సీడెడ్ | 0.90 cr |
ఆంధ్రా(టోటల్) | 0.16 cr |
ఏపి+తెలంగాణ (టోటల్) | 0.46 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.02 cr |
ఓవర్సీస్ | 0.03 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 0.51 cr |
‘స్కైలాబ్’ చిత్రానికి రూ.2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజులు కలుపుకుని ఈ చిత్రం కేవలం 0.51 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.2.49 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది అసాధ్యమనిపిస్తుంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!