సీజన్‌ను పొడిగిస్తున్న చిన్న సినిమాలు

సంక్రాంతి సీజన్‌ అనగానే… గుర్తొచ్చే అంశాల్లో సినిమా ప్రముఖంగా ఉంటుంది. పరిస్థితులు బాగుండుంటే థియేటర్ల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు, చిందులు, డ్యాన్స్‌లు, టికెట్ల గొడవలు … భలే సందడిగా ఉంటుంది. అయితే కరోనా వల్ల 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా జనాలు తక్కువగా వస్తున్నారు. అయితే ఏముంది సినిమాలు మాత్రం ఎప్పటిలాగే వరుస కట్టేశాయి. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల సందడి చేస్తున్నాయి. అయితే ఈ సీజన్‌ ఈ నెలాఖరు, వచ్చే నెల మొదటివారం కూడా ఉండోబోతోంది.

వైవిధ్యమైన సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ ‘జాంబీ రెడ్డి’ ఫిబ్రవరి 5న తీసుకొస్తున్నారు. ఇందులో తేజ సజ్జా, ఆనంది తదితరులు నటిస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన ట్రైలర్‌ అయితే ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆనాటి చిత్రం ‘బంగారు బుల్లోడు’ను జనవరి 23న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. పివి గిరి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్‌ సుంకర్‌ నిర్మించాడు. ప్రదీప్‌ మాచిరాజు, అమృత అయ్యర్‌ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కూడా ఈ నెలాఖరుకే వచ్చేస్తోంది. ఈ నెల 29 డేట్‌ పిక్స్‌ చేశారు.

నిజానికి ఈ సినిమాల్లో ‘జాంబీ రెడ్డి’, ‘బంగారు బుల్లోడు’ సంక్రాంతి రేసులోనే ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల మధ్య నలిగిపోవడం ఎందుకు అనుకున్నారో, లేక ఎవరైనా పెద్దలు సూచించారో కానీ సైడ్‌కి వచ్చేశాయి. దీంతో కొత్త తేదీలు ప్రకటించేశాయి. ప్రదీప్‌ సినిమా అయితే చాలా రోజుల నుంచి లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. ఇప్పుడు విడుదలకు ముందుకొచ్చింది. ఏదైతేముంది చిన్న సినిమాలు మన సంక్రాంతి సీజన్‌ను కొద్ది రోజులు పెంచుతున్నాయి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus