‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) సినిమా మొదటి నుండి సో సోగా ఉంటుంది.. కానీ క్లైమాక్స్ లో శివలింగం ఫైట్ వచ్చినప్పుడు, అందరూ ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్. ‘అఖండ’ (Akhanda) సినిమా అప్పటివరకు ఓకే అన్నట్టు ఉంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే బాలయ్య (Nandamuri Balakrishna) రథచక్రంతో ప్రత్యర్థులపై దాడి చేస్తాడో.. ఆ సీన్ కి అందరూ ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) కూడా సాదా సీదాగా సాగుతుంటుంది.
Mythology
కానీ ఎప్పుడైతే అనుపమ్ కేర్ కృషుడి గొప్పతనం వివరించే సీన్ వస్తుందో.. సినిమా బ్లాక్ బస్టర్ అనే ఫీల్ ను కలిగించింది. ‘హనుమాన్’ (Hanu Man) సెకండ్ హాఫ్ వీక్ గా ఉంది అనుకున్న టైంలో క్లైమాక్స్ లో హనుమంతుని ఎపిసోడ్ వస్తుంది.. అంతే సినిమా బ్లాక్ బస్టర్. ‘కల్కి..’ (Kalki 2898 AD) లో కూడా ఇలాంటి ఎపిసోడ్స్ ఉంటాయి. సో మైథాలజీ ఎపిసోడ్ ఉంటే సినిమా సూపర్ హిట్ అని అంతా భావిస్తున్నారు.
అందుకే చిన్న సినిమాల ఫిలిం మేకర్స్ కూడా అదే విజయ మార్గంగా భావిస్తున్నారు. అయితే ఈ జోనర్ కూడా ఓ టైంకి బోర్ కొట్టేసే ఛాన్స్ లేకపోలేదు. కథలో భాగంగా మైథాలజీ ఎపిసోడ్స్ వస్తే పర్వాలేదు.. బలవంతంగా ఇరికిస్తే ఫలితాలు ‘శక్తి’ (Sakthi) ..లా అయ్యే ప్రమాదం ఉంది. అంతెందుకు ఇటీవల ‘శివం భజే’ (Shivam Bhaje) అనే సినిమా వచ్చింది. అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా నటించిన ఈ సినిమాలో క్లైమాక్స్ లో పరమశివుడిని చూపించారు. ‘కాంతార’ లో హీరో రిషబ్ శెట్టిలా (Rishab Shetty) .. హీరోకి పూనకాలు వచ్చినట్టు చూపించారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడ చాలా బాగుంటుంది. అయినా సరే ఆడియన్స్ ఆ సినిమాకి కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా ‘జటాధర’ అనే సినిమా వస్తుంది. ఇది కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్నట్లు తెలియజేస్తూ ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ అనే చిన్న సినిమా తీసిన వెంకట్ కళ్యాణ్ దర్శకుడు. ఇందులో మైథాలజీ ఎలిమెంట్ క్లిక్ అయితే సుధీర్ బాబుకి హిట్ పడుతుంది. బలవంతంగా ఇరికిస్తే గట్టెక్కడం కష్టమే.