Bhaira Glimpse Review: ‘దేవర’ నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
- August 16, 2024 / 05:14 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ‘దేవర’ (Devara) అనే పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. మొదటి భాగం ‘దేవర 1′ గా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.’యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సమర్పిస్తున్నారు.
Bhaira Glimpse

ఇప్పటికే ఈ చిత్రం నుండి గ్లింప్స్, అలాగే 2 పాటలు బయటకు వచ్చాయి. అన్నిటికీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు అనగా ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే సందర్భంగా ‘దేవర 1 ‘ నుండి అతని పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ని వదిలారు. ఈ గ్లింప్స్ ను కనుక గమనిస్తే.. ‘భైరా’ అనే పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది.

రెండు రకాల షేడ్స్ కలిగిన లుక్స్ లో భైరాని ప్రజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇక ఈ వీడియోలో భైరా చాలా క్రూరంగా కూడా కనిపిస్తున్నాడు. కుస్తీ పోటీల్లో తనపైకి వచ్చిన వారిపై అతను దారుణంగా దాడి చేసి హతమారుస్తున్నట్టు చూపించారు. అలాగే మరోపక్క అతను నివసించే ప్రదేశంలోని జనాలు ఆయుధాలను ఊరేగిస్తూ , పూజలు చేస్తున్నట్టు కూడా ఈ గ్లింప్స్ లో చూపించారు. మీరు కూడా (Bhaira Glimpse Review) దీన్ని ఓ లుక్కేయండి :
















