Jyothi Rai, Jr NTR: బుల్లితెర బ్యూటీ జాక్ పాట్ కొట్టేసిందా?

  • January 20, 2024 / 07:38 PM IST

గుప్పెడంత మనసు సీరియల్‌ ద్వారా పాపులర్ అయిన జ్యోతి రాయ్‌ అందరికీ సుపరిచితమే. ఆ సీరియల్లో ఈమె తల్లి పాత్రలో కనిపిస్తుంది. జగతి అనే పాత్రలో చాలా ఎమోషనల్ గా కనిపిస్తుంటుంది. తర్వాత వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆన్ స్క్రీన్ పై ఎంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రియల్ లైఫ్లో మాత్రం చాలా బోల్డ్ గా ఉంటుంది. ఈమెకి పెళ్ళైనప్పటికీ.. భర్తకు విడాకులు ఇచ్చేసి మరీ, డైరెక్టర్ తో సహజీవనం చేస్తుంది.

మరోపక్క తనకి ఉన్న మదర్ ఇమేజ్ ను వదిలించుకోవాలని ఈమె చేసే గ్లామర్ ఫోటో షూట్లు అన్నీ ఇన్నీ కావు. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని చూస్తే ఎవ్వరైనా షాక్ తినాల్సిందే. అంతలా ఈమె గ్లామర్ షో చేస్తూ వస్తోంది. త్వరలో ఈమె ఓ సినిమాలో కూడా కనిపించనుంది. ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈమె మరో జాక్ పాట్ కొట్టేసినట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్నట్టు ఇదివరకే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

అందులో జ్యోతి రాయ్ (Jyothi Rai) కోసం ఓ మంచి పాత్రని డిజైన్ చేసాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటించే ఫిమేల్ ఆర్టిస్ట్ రోల్స్ చాలా బాగుంటాయి. కె.జి.ఎఫ్ లో రవీనా టాండన్, అర్చన జాయిస్ పాత్ర కావచ్చు, ‘సలార్’ లో ఝాన్సీ, శ్రీయ రెడ్డి, ఈశ్వరి రావు ..ల పాత్రలు కావచ్చు ఓ రేంజ్లో ఉంటాయి. కాబట్టి నిజమైతే.. జగతి అలియాస్ జ్యోతి రాయ్ దశ తిరిగినట్టే అనాలి..!

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus