ప్రముఖ బుల్లితెర నటి ఆత్మహత్య.. అతనితో సహజీవనం వల్లేనా..!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా నటీమణుల ఆత్మహత్య వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ విషయంపై ఇంకా ఇంకా పోలీసులు దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో నటి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అందరినీ విషాదంలో నెట్టేసింది.విషయంలోకి వెళితే… ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్‌ 18 రాత్రి సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది.

భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతంలో ఉన్న నాయపల్లిలో ఉన్న తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఆమె సొంతిల్లు కాదు అద్దెకు ఉంటున్న ఇల్లు. కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే అద్దెకు ఉంటూ వస్తోంది. ఆ ఇంటి యజమాని ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం బయటపడింది. రష్మీ రేఖ ఓజా సూసైడ్ చేసుకున్న గదిలో ఓ సూసైడ్‌ నోట్‌ కూడా పోలీసులకి దొరికిందట.

ఇందులో ‘తన చావుకు ఎవరూ కారణం కాదని రాసుకొచ్చింది. అయితే ‘ఐ లవ్‌ యూ సాన్’ అని రాసుకొచ్చింది. దీంతో పోలీసులకు అనుమానాలు పెరిగాయి. రష్మీని ఎవరో హత్య చేసి ఈ సూసైడ్ నోట్ రాసి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.మరోపక్క రష్మీ రేఖ కొన్నాళ్లుగా సంతోష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ వచ్చిందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఆమె మరణానికి సంతోష్‌ కారణమై ఉండొచ్చని రష్మీ తండ్రి ఆరోపిస్తున్నారు. ‘శనివారం నాడు అంటే జూన్‌ 18న రష్మీకి కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు.

తర్వాత ఆమె చనిపోయిందని సంతోష్‌ మాకు చెప్పాడు. సంతోష్‌, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు కూడా తెలీదు’ అంటూ రష్మీ రేఖ తండ్రి పోలీసులకు తెలిపారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన రష్మీ ‘కెమిటి కహిబి కహా’ అనే ఒడియా సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది. ఈమె వయసు కేవలం 23 సంవత్సరాలే కావడం విశేషం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus