శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వర్సటైల్ స్టార్ అడవి శేషు హీరోగా తెరకెక్కిన చిత్రం “మేజర్”. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఒక వీర సైనికుడు జీవిత కథ ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అడవి శేషు,శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల శోభితా ధూళిపాళ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ప్రమోద అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో ఏడుపు , ఆశ, ధైర్యం, నమ్మకం, భయం, నిరాశ .. ఇలా ఎన్నో కోణాలు కనిపిస్తాయి. భావోద్వేగాలతో కూడుకున్న చాలా బరువైన పాత్ర ఇది. అయితే గూడచారి సినిమా చేస్తున్న సమయంలోని అడవి శేష్ కి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక ఆరాధన భావం ఉండేది.
అడవి శేషు ఆయన గురించి ఎన్నో రీసెర్చ్ లు చేసి గూడచారి సినిమా షూటింగ్ సమయంలో ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ విధంగా ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియన్ అని చెప్పవచ్చు. కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా లేట్ అయింది లేకపోతే ఏడాది క్రితమే ఈ సినిమా విడుదల అయ్యేది.ఈ క్రమంలో శోభిత మాట్లాడుతూ.. మహేష్ బాబు బ్యానర్ లో పనిచేయడం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ లో తన సినిమాలను కాకుండా మొదటిసారిగా బయట సినిమాని చేశారు. కరోనా కారణంగా సినిమా ఓటిటి లోకి వెళ్లిపోయిందని చాలా ఆందోళన చెందాం. కానీ మహేష్ బాబు మాకు అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తూ ఇది సినిమా థియేటర్ లో రిలీజ్ కావాల్సిన సినిమా అంటూ బ్యాక్ బోన్ గా నిలిచారు.ఆయన నిర్మాణ సంస్థలో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏం