Liger Movie: ‘లైగర్‌’ కథపై సోషల్‌ మీడియాలో కథలు కథలు!

పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటివరకు చాలా రకాల వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా మరికొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన పుకార్లు చాలావరకు నిజమైనట్లు.. వీటిలో కొన్ని నిజమవ్వొచ్చు అని అంటున్నారు. అదే జరిగితే పూరీ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PCU) అనేది సిద్ధమైనట్లు అనుకోవచ్చు అని చెబుతున్నారు.

పూరి సినిమాటిక్‌ యూనివర్సా.. అంతగా ఏముంది అనుకుంటున్నారా? పూరి జగన్నాథ్‌ ఇప్పటివరకు తీసిన సినిమాలు ఏ రెండూ ఒకేలా ఉండవు. అయితే అందులో ఆయన ఐడియాలజీ, వన్‌ లైనర్లు చాలానే కామన్‌గా వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ‘లైగర్‌’కు ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’ సినిమాకు లింక్‌ ఉంది అంటున్నారు. ఆ సినిమాలో హీరో పాత్రకు, లైగర్‌కు సంబంధం ఉంటుంది అని చెబుతున్నారు. అలా సోషల్‌ మీడియాలో రెండు రకాల వార్తలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి.

‘లైగర్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండ పాత్ర.. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలోని హీరో పాత్రకు కొడుకు అవుతాడని అంటున్నారు. ఇది కొందరి వాదన అయితే, రెండో వాదన రవితేజ పాత్రకు లైగర్‌ మేనల్లుడు అవుతాడు అంటున్నారు. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’లో హీరో సవతి తల్లికి ఓ కూతురు ఉంటుంది. ఆ కూతురు ‘లైగర్‌’లో రమ్యకృష్ణ అవుతుంది అని ఓ కథ వినిపిస్తోంది. అంతేకాదు ‘లైగర్‌’లో రవితేజ అతిథి పాత్రలో కనిపిస్తాడనే ఊహాగానాలు నడుస్తున్నాయి.

మరి ఇదంతా నిజమేనా.. ఆ రెండు సినిమాలకు లింక్‌ ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ ఉంటే ఇది ఈ సినిమా వరకేనా, లేక పూరి కూడా సినిమాటిక్‌ యూనివర్స్‌ ఏమన్నా ప్లాన్‌ చేస్తున్నారా అనేది కూడా చూడాలి. ఒకవేళ పూరి సినిమాటిక్‌ యూనివర్స్‌ వస్తే మాత్రం.. తెలుగులో మాస్‌ హీరోలంతా దానికిందకే వచ్చేస్తారు. మరి అందరినీ కలిపి సినిమా చేసే ప్రయత్నం పూరి చేస్తార? చూద్దాం రిలీజ్‌ రోజు తెలిసిపోతుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus