Sohel: వాళ్ళు విన్నర్ అవుతారంటే.. నన్నేసుకుంటున్నారు : సోహైల్

మరో రెండు వారాల్లో ‘బిగ్‌బాస్‌5’ విన్నర్‌ ఎవరో తెలిసిపోతుంది. అయితే జనాలలో ఈ ప్రశ్న పెంచే ఆసక్తి కుతూహలం అంతా ఇంతా కాదు. టాప్ 5 లో వాళ్ళుంటారా? వీళ్ళుంటారా?టైటిల్ విన్నర్‌ ఎవరు అవుతారు అబ్బో ఇలా చాలా విధాలుగా డిస్కషన్లు నడుస్తున్నాయి. అయితే ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ మరియు గేమ్ ఛేంజర్ అయిన సోహైల్‌ మాత్రం టాప్5 లో ఉండేది వీళ్ళే… బిగ్ బాస్ విన్నర్ అతనే అవుతాడు అంటూ జోస్యం చెప్పాడు.

అయితే తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పి మిగతావారి కాన్ఫిడెన్స్ ను దెబ్బతీయడం ఎందుకని వెనక్కి తగ్గినట్టు కూడా స్పష్టంచేశాడు. విషయంలోకి వెళితే… ‘బిగ్ బాస్5’ లో ఉన్న సన్నీని చూస్తుంటే… ‘నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉందంటూ మురిసిపోతూ ఓ పోస్ట్ పెట్టాడు సన్నీ. అతనే తప్పకుండా విన్నర్‌ అవుతాడంటూ ధీమా వ్యక్తం చేస్తూ కామెంట్లు కూడా పెట్టాడు. సన్నీతో పాటు కాజల్‌, మానస్‌ కూడా ఫినాలేలో ఉంటారని ఆ పోస్ట్‌లో పేర్కొనడం విశేషం.

అయితే మిగిలిన కంటెస్టెంట్ల అభిమానులు ఇతన్ని ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసేసి వెనక్కి తగ్గాడు. ఈ విషయం పై సొహైల్ స్పందిస్తూ.. ‘ఎవరికైనా సపోర్ట్‌ చేస్తే.. మావాడు ఏం చేశిండు? మా పిల్ల ఏం చేసింది? అంటూ నన్ను ఏసుకుంటున్నారు. కాజల్‌, మానస్‌, సన్నీ టాప్‌లో ఉంటారని నా అభిప్రాయం చెప్పాను.. అంతే నామీద పడ్డారు. ఈ మధ్యనే సినిమాలు చేసుకోవడం మొదలుపెట్టా.. ఈ టైములో నాకెందుకు బాబోయ్…. అని భయపడి పోస్ట్ డిలీట్ చేసాను.

ఈ వీక్ అయితే సిరి, కాజల్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలిసింది. నా ఫేవరెట్ కంటెస్టెంట్లు శ్రీరామ్‌, సన్నీ… వీళ్ళలో ఒకరు విన్నర్ అవుతారు’ అంటూ సోహైల్ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక గతవారం అయితే ‘బిగ్ బాస్5’ నుండీ పింకీ ఎలిమినేట్ అయ్యింది.ఇదిలా ఉండగా.. సోహైల్ కామెంట్స్ బట్టి అయితే ఈ సీజన్లో కూడా లేడీస్ విన్నర్స్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus