బిగ్‌బాస్‌4: సంచాలక్‌గా సోహైల్‌ పనికి రాడా?

బిగ్‌బాస్‌ ఇంట్లో ఇంకా డీల్‌/నో డీల్‌ కార్యక్రమం కొనసాగుతోంది. క్లిష్టతరమైన టాస్క్‌లను ఇస్తూ బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను పరీక్షిస్తున్నాడు. ఈ రోజు కూడా అలాంటి కొన్ని టాస్క్‌లు చూడొచ్చు. పేడ నీటి తొట్టెలో కాయిన్స్‌ వెతికే డీల్‌ దివికి వచ్చింది. దివి తొలుత ధైర్యంగా దిగినా… తర్వాత మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక అవినాష్‌ ముఖానికి మాస్క్‌ వేసి… అరటి పండు తినమని డీల్‌ ఇచ్చాడు. దానిని అవినాష్‌ అదరగొట్టేశాడు.

ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో అసలు మజా అఖిల్‌ టాస్క్‌ దగ్గర వచ్చింది. శరీరం మొత్తానికి కంటిన్యూస్‌గా షాంపూ రాసుకోవడం ఆ టాస్క్‌ కాన్సెప్ట్‌లా కనిపిస్తోంది. అభిజీత్‌ ఈ టాస్క్‌ పూర్తి చేయిస్తున్నాడు. అయితే అఖిల్‌ కంట్లో షాంపూ పడటం గమనించిన మోనాల్‌ నీళ్లు పోయబోయింది. దీంతో మెహబూబ్‌ వారించాడు. ఆ తర్వాత నోయల్‌ క్లాత్‌తో కంటిని తుడిచాడు. ఇది బిగ్‌బాస్‌ రూల్స్‌కి విరుద్ధం అని చెప్తే ఆపేస్తాం అని నోయల్‌ అన్నాడు. దానికి అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఖిల్‌ ఉన్నాడు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు. అదే నేనో ఇంకెవరో కూర్చుంటే చుక్కలు చూపించరా మీరు అంటూ అరిచేశాడు.

అక్కడితో ఆగకుండా ‘సంచాలక్‌’గా నువ్వు కరెక్ట్‌ కాదు అని నాకు అనిపిస్తోంది అంటూ సోహైల్‌ ముఖం మీదే అనేశాడు అవినాష్‌. సంచాలక్‌గా నిర్ణయాలు నా ఇష్టం అని సోహైల్‌ అన్నాడు. దానికి అవినాష్ ‘పొద్దున్నుంచి గేమ్స్‌ ఆడుతున్నాం పిచ్చొళ్లమా’ అంటూ సమాధానమిచ్చాడు. నన్ను సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావ్‌ అన్నారు. ఇది కాదా సేఫ్‌ గేమ్‌ అంటూ అరిచేశాడు. ఒకరిని సపోర్టు చేసుకుంటూ, ఇంకొకరిని సపోర్టు చేయడం లేదు అని అవినాష్‌ విసురుగా అన్నాడు.

మామూలుగానే కోపం ఎక్కువగా వచ్చే సోహైల్‌… చాలాసేపు కంట్రోల్‌ చేసుకున్నాడు. అఖిల్‌ వచ్చి సర్దిచెప్పి వాష్‌ రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ కుర్చీకి కోపంతో ఓ పంచ్‌ ఇచ్చాడు సోహైల్‌. ఆ తర్వాత ‘నా తప్పు లేకపోయినా ఎవరేమన్నా నేను పడుతున్నా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తెలిసి సోహైల్‌ ఏడవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. అసలు అతని ఏడుపునకు కారణమేంటి అనేది రాత్రి ఎపిసోడ్‌లో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus