Sundeep Kishan: సందీప్ కిషన్.. సినిమాకి అప్పుడే అంత బిజినెస్ జరిగిందా?

సందీప్ కిషన్ (Sundeep Kishan) .. గతేడాది వరకు తన మార్కెట్ కి తగ్గట్టు సినిమాలు చేస్తూ వచ్చాడు.పారితోషికం కూడా పెద్దగా డిమాండ్ చేసింది అంటూ లేదు. అయితే ఈ ఏడాది నుండి తన పంధా పూర్తిగా మార్చుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమా రిలీజ్ అయ్యింది. దీనికి హిట్ టాక్ ఏమీ రాలేదు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. రూ.20 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.

Sundeep Kishan

ఆ తర్వాత సందీప్.. ధనుష్ (Dhanush) తో కలిసి నటించిన ‘రాయన్’ (Raayan) కూడా బాగానే ఆడింది. ఇక ప్రస్తుతం సందీప్ కిషన్.. త్రినాథ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో ‘మజాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండా (Rajesh Danda) నిర్మిస్తున్నారు. కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. సంక్రాంతి కానుకగా ‘మజాకా’ ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. కానీ పెద్ద సినిమాలు ఉన్నాయి..

కాబట్టి వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. మరోపక్క ఈ సినిమా నుండి ఒక్క పాట, గ్లింప్స్, టీజర్ వంటివి ఏమీ బయటకు రాలేదు. అయినప్పటికీ.. బిజినెస్ బాగా జరగడం విశేషంగా చెప్పుకోవాలి. శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ రూ.15 కోట్ల‌కు అమ్ముడయ్యాయి. ఆడియో రైట్స్ రూ.2.5 కోట్ల‌కు, హిందీ రైట్స్ రూ.4.5 కోట్ల‌కు సేల్ అయిపోయాయి.

సో మొత్తంగా రూ.23 కోట్లు అప్పుడే నిర్మాత పాకెట్లోకి వచ్చేశాయి. మొత్తంగా సినిమాకు రూ.30 కోట్లు(ప్రమోషన్స్ తో కూడా కలుపుకుని) బడ్జెట్ అవుతుందని తెలుస్తుంది. టీజర్, ట్రైలర్ వంటివి బయటకు వచ్చాక థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగిపోతుంది. సో టేబుల్ ప్రాఫిట్స్ తోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

టైమొచ్చింది సార్లూ… మాలీవుడ్‌లా టాలీవుడ్‌ సంగతి తేలాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus