Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ఘనంగా “సోలో బాయ్” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ – ముఖ్యఅతిథిగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్

ఘనంగా “సోలో బాయ్” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ – ముఖ్యఅతిథిగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్

  • July 2, 2025 / 11:23 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా “సోలో బాయ్” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ – ముఖ్యఅతిథిగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా “సోలో బాయ్” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హ జూలై 4వ తేదీన విడుదల

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. జుడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్ర రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు.

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ చిత్ర నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి సతీష్ ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించి సతీష్ ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

రఘు కుంచే మాట్లాడుతూ… “చిత్ర ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం ఉన్నారు. దర్శకుడు కావాలని వచ్చి నిర్మాత అయ్యారు. ఆయన ఓటిటి ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ ఎంతో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ ద్వారా వెండిస్తల పైకి రానున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాలు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

కె ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… “నాకు ఈరోజే సతీష్ దర్శకుడు కావాలని వచ్చి నిర్మాత వేయాలని తెలిసింది. ఇటువంటిది వినడం ఇదే మొదటిసారి. ప్యాషన్ తో వచ్చి సినిమాలు చేసే అతి తక్కువ మందిలో సతీష్ ఒకరు. అది అతని సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. డైరెక్టర్ కావాలనుకున్న అతని కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రేక్షకులు అంతా పైరసీని అరికడుతూ వెండి ధరపై ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… “సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సతీష్ గతంలో కూడా సినిమా చేశారు. అప్పుడు ఆర్ పి పట్నాయక్ గారు అతనికి అండగా నిలిచారు. ఇప్పుడు సోలో బాయ్ ద్వారా మరోసారి మన ముందుకు మరొక మంచి సినిమా తీసుకువస్తున్నారు. గౌతమ్ కృష్ణ డాక్టర్ కావలసిన వాడు యాక్టర్ అయ్యాడు. ఎంతో ప్యాషన్ తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. వారి కుటుంబంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు సోలో బాయ్ చిత్రం ద్వారా వెండితెరపై కనిపించనున్నారు. గతంలో నారా రోహిత్ సోలో చిత్రం ఎంత విజయం సాధించిందో ఇప్పుడు సోలో బాయ్ చిత్రం కూడా అంతే విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సతీష్ ఇంకా మంచి నిర్మాణ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

లిరిసిస్ట్ పూర్ణచారి మాట్లాడుతూ… “సోలో బాయ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ పేరుపేరునా నా నమస్కారం. బిగ్ బాస్ తర్వాత గౌతమ్ కృష్ణ వెండితెర పైకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పట్టాడు. లాక్డౌన్ సమయంలో బట్టల రామకృష్ణ బయోపిక్ ద్వారా ప్రేక్షకులు ముందుకు నిర్మాతగా వచ్చిన సతీష్ గారు ఇప్పుడు సోలో బాయ్ చిత్రాన్ని వెండి తెర పైకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలి. ముందు ముందు మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, నేను మీతో పని చేయాలని కోరుకుంటున్నాను. చిత్రానికి చూడా సంధ్య గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. హీరోయిన్లు ఇద్దరు తలపై చాలా బాగున్నారు. జులై 4వ తేదీన సోలో బాయ్ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

ఆట సందీప్ మాట్లాడుతూ… “గౌతమ్ కృష్ణ నాకు బిగ్ బాస్ ద్వారా బాగా పరిచయం. అప్పటినుండే నా సినిమాలో మీరు చేయాలి అని గౌతమ్ నాతో ఉంటూ ఉండేవారు. అలాగే సోలో బాయ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది నిర్మాత సతీష్ గారు. చిన్న సినిమా అనుకుంటున్నాము కానీ ఈ సినిమా వెనుక ఎన్నో పెద్ద సంస్థలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఎంతో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గౌతమ్ ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. జులై 4వ తేదీన ఈ చిత్రాన్ని అందరూ విజయం సాధించేలా చేయాలని కోరుకుంటున్నాను. మురళి నాయక్ కుటుంబానికఅభినందిస్తున్నానుయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్” అన్నారు.

అనిత చౌదరి మాట్లాడుతూ… “మీడియా వారికి, ఈవెంట్ కు వచ్చిన వారికి అందరికీ నమస్కారం. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా చేసిన ఈ సోలో బాయ్ చిత్రం ద్వారా పరిచయమైన అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమాలో నటించిన వారికి, అలాగే టెక్నీషియల్ అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమాలోని పాటలు ఇంకా సంగీతం చాలా బాగున్నాయి. నిర్మాత సతీష్ గారితో ఈ చిత్ర ప్రయాణం చాలా మంచిగా అనిపించింది. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాను మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ శ్వేత అవస్తి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నాకు చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి అలాగే చిత్ర బృందం అందరికీ నా థాంక్స్. మీ అందరితో పని చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జులై 4వ తేదీన మా సినిమాను అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ రమ్య పసుపులేటి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమాలో గౌతం కృష్ణ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. నాకు మీరు ఎంతో కాలంగా తెలుసు. జూలై 4వ తేదీన ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… “సోలో బాయ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. మా చిత్రం జూలై 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని రకాల జోనర్లు కనిపిస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సినిమాలో పాటలు సంగీతం చాలా బాగా వచ్చాయి. సినిమా కోసం టెక్నికల్ గా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా డైరెక్షన్ టీమ్ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత గౌతమ్ కృష్ణకు ఎన్నో పెద్ద సినిమాలు వస్తాయి. నాకు ఈ సినిమా దర్శకత్వం చేసేందుకు అవకాశం ఇచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్యాషన్ తో వచ్చి ఎంతో కష్టపడి చిత్ర నిర్మాణానికి సహాయపడుతూ ఉండే మనిషి. ప్రతి విషయంలోనూ ఎంతో సపోర్టుగా నిలిచారు. మంచి కంటెంట్ తో విజయం సాధించిపోతున్నామని మాకు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. మా నిర్మాత ఈ చిత్రం ద్వారా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిశ్రమకు ఇంకెంతమందిని పరిశీలించాలని అనుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… “ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, చిత్ర పరిశ్రమకు, మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు. నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. చాలా చిన్నగా మొదలై ఇప్పుడు పెద్ద స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా సోలో బాయ్. గౌతమ్ కృష్ణ నాకు తమ్ముడి లాంటివాడు. గౌతమ్ ఈ సినిమా కోసం ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సినిమా కోసం ప్రతి విషయంలోనూ నాకు ఎంతో సపోర్టుగా నిలిచాడు. ఈ సినిమా గౌతం సినీ కెరియర్లో ఒక మంచి మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సోలో బాయ్ చిత్రం ప్రేక్షకులందరిదీ. నేను సినిమాకు చాలా కరెక్ట్ అయ్యాను. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు సోలో బాయ్ రాబోతుంది. చిత్ర టెక్నికల్ టీమ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో నటించిన ఇతర నటినటులు అంతా చాలా బాగా చేశారు. మీడియా వారు ఈ చిత్రానికి బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఇటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. దర్శకుడు నవీన్ కుమార్ గారు ఎంతో కమిట్మెంట్తో ఉండే వ్యక్తి. చాలా తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను ఎంతో మంచి అవుట్ పుట్ తో తీసుకొచ్చాము. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఎంతో సీనియర్ నటినటులు మాతో నటించినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. టెక్నికల్ టీం అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సినిమాకు సపోర్టుగా వచ్చిన ప్రతి అతిధికి నా ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దానిని ఒక సక్సెస్ లా చూస్తున్నాను. నన్ను ప్రశ్నించే వారికి ఇదేనా సమాధానం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మురళి నాయక గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్” అంటూ ముగించారు.

నటీనటులు – గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు

సాంకేతిక బృందం:
కాస్ట్యూమ్స్ – రిషిక, వీణాధరి
సినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధు
సంగీతం – జుడా సాండీ
కో-డైరెక్టర్ – కినోర్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – SK నయీమ్
లిరిక్ రైటర్స్ – శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రాఫర్: ఆటా సందీప్
బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
నిర్మాత – సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం – పి. నవీన్ కుమార్
పి ఆర్ ఓ : మధు VR
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gautham krishna
  • #Shweta Avasthi
  • #Solo Boy

Also Read

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

War 2 Trailer: అవమానాలు లెక్క చేయనంటున్న హృతిక్.. పాప పుణ్యాలు పట్టించుకోనంటున్న ఎన్టీఆర్

War 2 Trailer: అవమానాలు లెక్క చేయనంటున్న హృతిక్.. పాప పుణ్యాలు పట్టించుకోనంటున్న ఎన్టీఆర్

related news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

trending news

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

22 hours ago
Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

1 day ago

latest news

Vijay Deverakonda: ‘కింగ్డమ్‌’ చేతుల్లోంచి వెళ్లిపోయిందట.. విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ కామెంట్స్‌

Vijay Deverakonda: ‘కింగ్డమ్‌’ చేతుల్లోంచి వెళ్లిపోయిందట.. విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ కామెంట్స్‌

21 mins ago
NTR: తన సొంత ఇంట్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..!

NTR: తన సొంత ఇంట్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..!

42 mins ago
Sandeep Reddy Vanga: ఆ 8 నిమిషాలు లేపేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: ఆ 8 నిమిషాలు లేపేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి వంగా

53 mins ago
Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కామెంట్స్.. ఎవరి గురించో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కామెంట్స్.. ఎవరి గురించో..!

58 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ కూడా ‘హరిహర వీరమల్లు’ మార్గంలోనే..!

Vishwambhara: ‘విశ్వంభర’ కూడా ‘హరిహర వీరమల్లు’ మార్గంలోనే..!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version