లాక్ డౌన్ అనంతరం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసిన ఈ సినిమాకి తొలిరోజు మంచి టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో ఆకట్టుకోగా.. సెకండ్ హాఫ్ ఏవరేజ్ గా ఉందని చెబుతున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అని టాక్ రావడం చిత్రబృందానికి ఆనందాన్ని కలిగిస్తోంది. చాలా కాలం తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో ప్రేక్షకులు సినిమాకి వస్తారా..? అనే అనుమానాలకు ఈ సినిమా బ్రేక్ వేసింది.
తొలిరోజు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోవక్కర్లేదు అనిపిస్తోంది. అన్ని సెంటర్లలో మొదటి ఆట నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ కురిపించింది ఈ సినిమా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా తొలిరాజు రూ.4.70 కోట్లను కొల్లగొట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇవే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అని.. అతడి గత సినిమాల కంటే ఈ సినిమా తొలిరోజు ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టిందని టాక్. నిజానికి కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిందని అంటున్నారు. లేదంటే కనీసం రూ.10 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చేవని చెబుతున్నారు.
ఏరియాల వారీగా కలెక్షన్స్ :
నైజాం
1.84 cr
సీడెడ్
0.86 cr
వైజాగ్
0.57 cr
ఈస్ట్
0.34 cr
వెస్ట్
0.25 cr
కృష్ణా
0.21 cr
గుంటూరు
0.43 cr
నెల్లూరు
0.20 cr
టోటల్ కలెక్షన్స్
38.49 cr
మొత్తంగా ఈ సినిమా రూ.4.70 కోట్లను రాబట్టింది. ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు కలెక్షన్స్ ఊరటని కలిగిస్తున్నాయి. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి ఇప్పుడు మరిన్ని సినిమాలు థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.