దాదాపు 9నెలల పాటు థియేటర్లు క్లోజ్ అయ్యి ఉండడంతో.. జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటిలనే నమ్ముకున్నారు. థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా… కరోనా భయంతో జనాలు థియేటర్లకు వస్తారా? అనే డౌట్ లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం డిసెంబర్ 25న విడుదల కాబోతుంది అని ప్రకటించగానే… అసలు ఆ సినిమాని జనాలు పట్టించుకుంటరా?? 50శాతం ఆకుపెన్సీతో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందా? అంటూ ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే సినిమాకి పెద్ద హిట్ టాక్ ఏమీ రాకపోయినా కానీ… ఒకసారి థియేటర్ మొహం చూసి రావాలి అనుకునే ప్రేక్షకులు.. ‘సోలో బ్రతుకు’ కి విముక్తి కలిగించారు.
ఇక ఈ చిత్రం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు దగ్గరపడింది. ఆ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 2.71 cr |
సీడెడ్ | 1.39 cr |
ఉత్తరాంధ్ర | 1.14 cr |
ఈస్ట్ | 0.64 cr |
వెస్ట్ | 0.41 cr |
కృష్ణా | 0.45 cr |
గుంటూరు | 0.65 cr |
నెల్లూరు | 0.39 cr |
ఏపీ+తెలంగాణ | 7.78 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.48 cr |
ఓవర్సీస్ | 0.35 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 8.61 cr |
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.8.61 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో కోటి వరకూ షేర్ ను రాబడితే.. ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరో లాంగ్ వీకెండ్ మిగిలుంది కాబట్టి.. సాయి తేజ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే చెప్పాలి.
Click Here To Read Movie Review
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!