సోలోగా బాగానే కలెక్ట్ చేస్తున్నాడు!

కరోనా రోజుల్లో జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారా..? యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తాయా..? అనే సందేహాలన్నింటికీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ఫుల్ స్టాప్ పెట్టింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తోంది. మొదటి రోజు ఏపీ, తెలంగాణాలలో కలిపి రూ.4 కోట్ల 70 లక్షలు గ్రాస్ సాధించిన ఈ సినిమా రెండో రోజు రూ.3 కోట్ల 29 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లు తగ్గుతాయేమోనని భావించారు.

కానీ అలా జరగలేదు. రెండు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్ల 99 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇదే గనుక కంటిన్యూ అయితే చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం. కరోనా టైమ్, యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ రేంజ్ లో వసూళ్లు రావడంతో విశేషమనే చెప్పాలి.

ఏరియాల వారీగా కలెక్షన్లు..

నైజాం 1.19 cr
సీడెడ్ 0.59 cr
వైజాగ్ 0.55 cr
ఈస్ట్ 0.24 cr
వెస్ట్ 0.15 cr
కృష్ణా 0.18 cr
గుంటూరు 0.26 cr
నెల్లూరు 0.13 cr
టోటల్ కలెక్షన్స్ 3.29 cr

మొత్తంగా ఈ సినిమా రెండు రోజులకు కలిసి రూ.7.99 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus